రెడీ అయిన అక్కినేని అఖిల్.. ఇకపై ఈ బ్యాచిలర్‌దే హంగామా

సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో అక్కినేని అఖిల్.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' గా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయ్యాడు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అఖిల్ నాలుగో సినిమాగా ఈ మూవీ విడుదల కానుంది.

గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపి చూపించడంలో సిద్ధహస్తుడైన బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. అఖిల్ కెరీర్ టర్న్ అయ్యేలా ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగజేశాయి.

Most Eligible Bachelor ready: Akhil Akkineni time start

ఈ నేపథ్యంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఆడియో ఆల్బమ్ నుంచి మొదటి పాట‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మార్చి 2న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఫ‌స్ట్ సింగిల్ ని విడుద‌ల చేస్తున్నట్లుగా ఈ చిత్ర నిర్మాతలు బ‌న్నివాసు, వాసు వ‌ర్మ తెలిపారు.

ఆ రోజు నుంచి ఇక ఈ బ్యాచిలర్‌దే హంగామా అని అంటున్నారు యూనిట్ సభ్యులు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. ముఖ్య తారాగ‌ణంతో పాటు అఖిల్, పూజా హగ్ధేలు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X