పొడుగు కాళ్లతో అఖిల్ చెవిని తాకిన పూజా హెగ్డే.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ పోస్టర్ వైరల్!
అక్కినేని యువ హీరో అఖిల్ చాలా రోజుల తరువాత ఒక పోస్టర్ తో దర్శనమిచ్చాడు. తన నాలుగవ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అప్డేట్ ఎప్పుడు ఇస్తాడా అని వెయిట్ చేస్తున్న అభిమానులకు మొత్తానికి ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. అంతా బాగానే ఉంది కానీ ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యేలా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఓ వర్గం నెటిజన్స్ ట్రోల్ చేయడం కూడా స్టార్ట్ చేశారు.

వర్కౌట్ కాలేదు..
గీత ఆర్ట్స్ కి చెందిన GA2 ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అసలైతే సమ్మర్ లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా వేయక తప్పలేదు. లాక్ డౌన్ అనంతరం ఆగస్ట్ లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చినప్పటికీ వర్కౌట్ కాలేదు.

మీమర్స్ కి స్టఫ్ ఇచ్చారా..
కరోనా వైరస్ కారణంగా థియేటర్స్ తెరిచినా కూడా జనాలు వచ్చే అవకాశం లేకపోవడంతో వచ్చే ఏడాదికి మంచి సమయాన్ని ఫిక్స్ చేసుకున్నారు. సంక్రాంతికి రాబోతున్నట్లు ఒక పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అంతా బాగానే ఉంది కానీ పోస్టర్ కాస్త తేడా కొడుతోంది. ఓ విధంగా మీమర్స్ కి స్టఫ్ ఇచ్చారా అనే కామెంట్స్ వస్తున్నాయి.

పూజా హెగ్డే కాళ్లతో..
పూజా హెగ్డే కాలితో నాగ చైతన్య చెవిని రొమాంటిక్ గా తాకిన విధానం కాంట్రవర్సీ అయ్యేలా ఉంది. ఓ వర్గం వారు బాగానే ఉందని అంటున్నప్పటికి సోషల్ మీడియాలో మాత్రం ట్రోలింగ్ డోస్ తగ్గడం లేదు. ఇక మరికొందరు పూజా చాలా బ్యూటీఫుల్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎదో ఒక విధంగా పోస్టర్ అయితే హాట్ టాపిక్ అయ్యేలా కనిపిస్తోంది.
Recommended Video

ఎలాగైనా హిట్టు కొట్టాలని..
ఇక అఖిల్ ప్రస్తుతం ఎలాగైనా ఈ సినిమాతో మంచి బాక్సాఫీస్ హిట్టు అందుకోవాలని చూస్తున్నాడు. మొదటి మూడు సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ఫస్ట్ హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. సక్సెస్ ట్రాక్ లో లేని బొమ్మరిల్లు భాస్కర్ ని నమ్మాడు అంటే సినిమాలో ఏదో కొత్త పాయింట్ ఉండవచ్చనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ సినిమాతో అక్కినేని హీరో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











