For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా కాబోయే భర్త చెప్పుతో సమానం.. సైకో ఫెలో అంటూ వైల్డ్‌గా పూజా హెగ్డే రియాక్షన్

    |

    ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తూ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్‌ చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. దసరా కానుకగా ఈ సినిమా టీజర్‌ను ప్రేక్షకులకు అందించారు. ఈ టీజర్‌లో పూజాహెగ్డే, అఖిల్ అక్కినేని వ్యవహారం ఎలా ఉందంటే..

    పెళ్లి నుంచి ఏం కోరుకొంటున్నారు

    పెళ్లి నుంచి ఏం కోరుకొంటున్నారు

    పెళ్లి నుంచి మీరు ఏం కోరుకొంటున్నారు అంటూ అఖిల్ అడిగిన ప్రశ్నకు పూజా హెగ్డే స్పందిస్తూ.. కేరింగ్‌గా చూసుకొనే భర్త. అన్ని పనులు షేర్ చేసుకోవాలి. జాయింట్ ఫ్యామిలీ ఉండకూడదు. లవ్ లవ్ లవ్ మాత్రమే ఉండాలి. వైవాహిక జీవితంలో ఇంతకంటే ఏముంటుంది అంటూ తన కోరికల చిట్టాను బయటపెట్టింది. దాంతో బుర్ర గోక్కొవడం అఖిల్ వంతైంది.

    వైల్డ్‌గా ఆలోచించండి అంటూ

    వైల్డ్‌గా ఆలోచించండి అంటూ

    అయితే పూజా హెగ్గే సమాధానాన్ని జీర్ణించుకోలేని అఖిల్.. కాస్త వైల్డ్‌గా ఆలోచించండి అంటూ మళ్లీ ప్రశ్న వేశాడు. నాకు కాబోయే వాడు నా షూస్‌తో సమానం అంటూ చెప్పగానే అఖిల్ బిత్తరపోయాడు. అందాల ఆరబోతతోపాటు పూజా హెగ్డే చెప్పిన డైలాగ్స్‌తో మంచి రొమాంటిక్ చిత్రమనే ఫీలింగ్‌ను టీజర్ కల్పించింది.

    నాకు సెన్ సెట్ అంటేనే ఇష్టం

    ఇక మీకు సన్ రైజింగ్ అంటే ఇష్టమా? లేక సన్ సెట్ అంటే ఇష్టమా అని పూజా హెగ్డే అడిగిన ప్రశ్నకు సూర్యస్తమయం అంటేనే ఇష్టం అని క్విక్‌గా సమాధానం ఇవ్వగా.. ఎందుకు అని పూజా అడిగితే.. చీకటి పడితే గానీ అసలు పని మొదలు కాదుగా అంటూ అఖిల్ మనసులో విషయాన్ని బయటపెట్టాడు. దాంతో సైకో ఫెల్లో అంటూ పూజా కామెంట్ చేసింది.

    ఇడ్లీ, వడ, సాంబార్ అంటూ...

    ఇడ్లీ, వడ, సాంబార్ అంటూ...

    ఇంతటితో అఖిల్ ప్రశ్నల వర్షం ఆగలేదు.. మళ్లీ మీరు పెళ్లి నుంచి ఏమి ఆశిస్తున్నారు అంటూ.. ఇడ్లీ, వడ, సాంబార్ అంటూ అఖిల్ ముఖంపై ధడేలున డోర్ మూసేసింది. ఇలాంటి రొమాంటిక్ డైలాగ్స్‌తో రిలీజ్ చేసిన టీజర్ ఆసక్తిని రేపింది. ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

    English summary
    Most Eligible Bachelor Teaser released: Akhil Akkineni conversation with Pooja Hegde about marriage goes hillarious in the Teaser. This movie is produced by Bunny Vas and Prashanth Varma, Allu aravind presented. This teaser released on Dussehra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X