సినిమా సెలబ్రిటీల ఖరీదైన విడాకులు (ఫోటో ఫీచర్)
ముంబై: సినిమా పరిశ్రమకు చెందిన స్టార్స్ పెళ్లి కాకుండానే సహజీవనం చేయడం, ప్రేమ వివాహాలు చేసుకోవడం, కొంతకాలం కలిసి ఉండి విడాకులు తీసుకోవడం అనేది సర్వ సాధారణమైన విషయం. విడాకుల విషయం గురించి మాట్లాడుకుంటే ఈ మధ్య ఇవి చాలా కామన్ అయిపోయాయి. విడాకులతో పాటు విడాకుల అనంతరం భార్య భర్తల మధ్య డబ్బు సెటిల్మెంట్స్ కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి.
తాజాగా హృతిక్ రోషన్, సుజానె విడాకుల విషయం హాట్ టాపిక్ అయింది. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఈ మధ్యే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం సుజానె భర్త నుండి రూ. 400 కోట్ల భరణం డిమాండ్ చేస్తుందనే విషయం హాట్ టాపిక్ అయింది.
హృతిక్, సుజానె విషయంలో మాత్రమే కాదు....గతంలో ప్రభుదేవా, కరిష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్ విషయంలో ఇలాంటి ఖరీదైన విడాకుల సెటిల్మెంట్లు జరిగాయి.
అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

హృతిక్ రోషన్-సుజానె ఖాన్
హృతిక్ రోషన్ నుండి విడిపోయిన సుజానె రోషన్ భర్త నుండి రూ. 400 కోట్ల భరణం అడుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రభుదేవా-రమాలత్
ప్రభుదేవాతో విడాకుల అనంతరం అతని భార్య రమాలత్‌కు దాదాపు 25 కోట్ల ఆస్తులు ఆమెకు సంక్రమించినట్లు సమాచారం. దీంతో పాటు రెండు ఖరీదైన కార్లు కూడా. దీంతో పాటు కొంత డబ్బు కూడా ఇచ్చాడట.

సంజయ్ దత్-రియా పిళ్లై
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన మాజీ భార్య రియా పిళ్లైతో విడిపోయిన సమయంలో ఆమెకు భరణం కింద రూ. 8 కోట్ల నగదుతో పాటు, ఖరీదైన కారు ఇచ్చాడట.

కరీనా కపూర్, సంజయ్ కపూర్
కరీనా కపూర్ తన భర్త సంజయ్ కపూర్‌తో విడిపోయింది. అయితే ఆమె ఇప్పటి వరకు విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టలేదు. భర్త నుండి రూ. 7 కోట్లు రావాల్సి ఉండటం వల్లనే సంతకం పెట్టడం లేదని టాక్.

సైఫ్ అలీ ఖాన్- అమృతా సింగ్
సైఫ్ అలీ ఖాన్ తన మొదటి భార్య అమృత సింగ్‌తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం ఆమెకు భారీ మొత్తంలో ఆస్తులు సమర్పించుకున్నట్లు టాక్.

ఆదిత్య చోప్రా, పాయల్ ఖన్నా
బాలీవుడ్ బడా నిర్మాత, యశ్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా...తన మొదటి భార్య పాయల్ ఖన్నాను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెతో విడిపోయారు. విడాకుల సమయంలో అతను భారీ మొత్తాన్ని భరణం కింద చెల్లించినట్లు బాలీవుడ్ టాక్.


Click it and Unblock the Notifications











