twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ కు చుక్కలు చూపిన జై భీమ్.. గూగుల్ టాప్ టెన్ లో టాప్ ప్లేస్.. ఇంకేం సినిమాలు ఉన్నాయంటే?

    |

    పాత సంవత్సరానికి గుడ్ బై చెబుతూ నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో అన్ని వర్గాల వాళ్ళు ఈ ఏడాదిలో జరిగిన స్వీట్ మెమోరీస్, బాధాకరమైన విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. బిజినెస్ గురించి, సినిమా గురించి, ఏ రంగంలో నైనా 2021లో జరిగిన విషయాల గురించి చర్చించుకుంటున్నారు. గూగుల్ కూడా అదే పనిలో నిమగ్నమై ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా ప్రజలు గూగుల్ లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన పది సినిమాలను గుర్తించి జాబితాను విడుదల చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

    అన్నీ ఒటీటీలోనే

    అన్నీ ఒటీటీలోనే

    2021 సంవత్సరంలో విడుదలైన సినిమాల గురించి మాట్లాడాలంటే చాలా వరకు OTT ప్లాట్‌ఫారమ్‌లలో ప్రీమియర్‌లను ప్రదర్శించాల్సి వచ్చింది. సంవత్సరం ద్వితీయార్థంలో సినిమాలు థియేటర్‌లలో విడుదల అవడం మొదలయ్యాయి. భారతదేశంలో మరియు ఇతర దేశాలలో కూడా కరోనావైరస్ దెబ్బతినడంతో థియేట్రికల్ విడుదలలను తాత్కాలికంగా నిలిపివేయవలసి వచ్చింది.

    జై భీమ్ మొదటి స్థానం

    జై భీమ్ మొదటి స్థానం

    కాబట్టి ఈ సంవత్సరం సెర్చ్ చేసిన మొదటి ఐదు సినిమాల గురించి చెప్పాలంటే ముందుగా జై భీమ్ మొదటి స్థానం సాధించింది. ఆ తర్వాత షేర్షా , రాధే, బెల్ బాటమ్ మరియు ఎటర్నల్స్ ఉన్నాయి. ఇక ఆయా సినిమాల విషయానికి వస్తే నవంబర్ 2 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన సూర్య చిత్రం జై భీమ్ భారతదేశంలో ఈ సంవత్సరం అత్యధికంగా శోధించబడిన చిత్రంగా నిలిచింది. సూర్య హీరోగా తెరకెక్కిన 'జై భీమ్' సినిమాలో లిజోమోల్ జోస్, మణికంఠలు నటించారు.

    ‘షేర్షా' రెండో స్థానంలో

    ‘షేర్షా' రెండో స్థానంలో

    ఇక భారత సైన్యంలో విశేష సేవలందిస్తూ ఎంతోమంది తమ జీవితాలను త్యాగం చేశారు. అలాంటి వారిలో కెప్టెన్‌ విక్రమ్‌ బాత్రా ఒకరు. కార్గిల్‌ యుద్ధంలో అసమాన పోరాటం చేసి, శత్రుమూకలను తరిమికొట్టారు. తోటి సైనికులు ఆయన ధైర్య సాహసాలు చూసి, 'షేర్‌ షా' అనిపిలిచేవారు. 24 ఏళ్ల వయసులో కార్గిల్‌ యుద్ధంలోనే పోరాడుతూ అమరుడయ్యారు. ఆయన జీవిత కథతో సిద్ధార్థ్‌ మల్హోత్రా కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా 'షేర్షా' రెండో స్థానంలో నిలిచింది.

    Recommended Video

    Akhanda Review : Balakrishna Man Of Masses For Decades | Jai Balayya || Filmibeat Telugu
     టాప్ టెన్ లోకి వెళితే

    టాప్ టెన్ లోకి వెళితే

    సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రం మేలో భారతదేశంలో ZEE5 ద్వారా జీ ప్లెక్స్‌లో ప్రదర్శించబడింది. అక్షయ్ కుమార్ యొక్క బెల్ బాటమ్, క్లోజ్ జావో దర్శకత్వం వహించిన ఎటర్నల్స్ సినిమాలు కూడా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.

    ఇక మొదటి పది ఫలితాల్లో ఉన్న ఇతర సినిమాలలో మాస్టర్ సినిమా ఆరో స్థానం, సూర్యవంశీ సినిమా ఏడో స్థానం, గాడ్జిల్లా vs కాంగ్ సినిమా ఎనిమిదో స్థానం, దృశ్యం 2 సినిమా తొమ్మిదో స్థానం మరియు భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమా పదో స్థానంలో ఉన్నాయి. కాబట్టి 2021కి సంబంధించిన సెర్చ్ ఫలితాల్లో టాప్ టెన్ ఇయర్స్‌లో ఉన్న సినిమాలు ఇవే.

    English summary
    most searched movies on google 2021 in india.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X