2017 గూగుల్ ఇయర్ ఎండ్ రిపోర్ట్: ‘బాహుబలి’ పాట, ఆట టాప్!
Recommended Video

ప్రముఖ సెర్చింజన్ గూగుల్ 2017 సంవత్సరంలో మోస్ట్ పాపులర్ యాప్స్, గేమ్స్, మూవీస్, సాంగ్స్ మరియు టీవీ షోల వివరాలు శుక్రవారం ప్రకటించింది. గూగుల్ రిపోర్టు ప్రకారం ఇండియాలో ఈ ఏడాది విడుదలైన 'బాహుబలి-ది కంక్లూజన్' చిత్రంలోని పాట, మొబైల్ గేమ్ టాప్ పొజిషన్లో నిలిచింది.

సాహోరే బాహుబలి సాంగ్ నెం.1
బాహుబలి-2 టైటిల్ సాంగ్ ‘సాహెరే బాహుబలి' ఇంటర్నెట్‌లో అత్యధికంగా స్ట్రీమ్ చేసిన పాటగా రికార్డులకెక్కింది. పలువు బాలీవుడ్ సాంగులను సైతం వెనక్కి నెట్టి ఈ పాట నెం.1 స్థానాన్ని సంపాదించుకుంది.

నెం.1 గేమ్ బాహుబలి: ది గేమ్
ఇండియాలో 2017 సంవత్సరంలో టాప్ లో ఉన్న గేమ్ కూడా ‘బాహుబలి: ది గేమ్' కావడం గమనార్హం. ఇంటర్నేషనల్ గేమ్స్ ‘డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్స్', ‘సూపర్ మ్యారియో రన్', ‘పోకెమాన్ డ్యుయల్' గేమ్‌లను దాటి బాహుబలి మొదటి స్థానంలో నిలిచింది.

టాప్ మూవీ డియర్ జిందగీ
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘డియర్ జిందగీ' చిత్రం 2017 గూగుల్ ప్లేలో పాపులర్ చిత్రంగా నిలిచింది. ‘డియర్ జిందగీ' తర్వాత ‘మోనా', ‘వండర్ ఉమెన్' చిత్రాలు ఉన్నాయి.

థాంక్స్ చెప్పిన బాముబలి టీం
తమ సినిమాను, తమ సినిమా పాటను, తమ సినిమాకు సంబంధించిన మొబైల్ గేమ్ ను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ఈ సందర్భంగా బాహుబలి టీం థాంక్స్ చెప్పింది.


Click it and Unblock the Notifications











