మోస్టు వాంటెడ్ లిస్టులో సమంత
మోస్టు వాంటెడ్ లిస్టులో దూకుడు భామ సమంత చేరిపోయింది. కొంపతీసి ఈ మోస్టువాంటెడ్ లిస్టు అదేదో...పోలీసుల మోస్టువాంటెడ్ లిస్టు అనుకునేరు. ఈ మోస్టు వాంటెడ్ లిస్టు సినిమా రంగానికి సంబంధించింది. టాలీవుడ్ లో ఏ దర్శకుడు, ఏ హీరో సినిమా తీయాలనుకుంటున్నా ముందుగా సమంతకు ప్రిపరెన్స్ ఇస్తున్నారు. సాధారణంగా ఒక్క సినిమా హిట్టయితేనే హీరోయిన్లుకు అవకాశాల మీద అవకాశాలు వచ్చి పడతాయి. మరి వరుసగా మూడు సక్సెస్ లను తన ఖాతాలో వేసుకున్న సమంతకు ఏ రేంజ్ లో డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
దూకుడు సినిమా తర్వాత సమంత తన రెమ్యూనరేషన్ ఏకంగా కోటికి పెంచేసి ఇలియాన, అనుష్క రేంజ్ లో డిమాండ్ చేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే కోటి రూపాయలు తనకు ఎవరూ ఇవ్వలేదంటూ ఇన్ కంటాక్సు వారి కళ్లు తనమీద పడకుండా జాగ్రత పడిందీ భామ.
ప్రస్తుతం సమంత చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ఈగ సినిమా చేస్తుండగా, గౌతం మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా, ఆటో నగర్ సూర్యలో నాగచైతన్య సరసన ఓ సినిమా, నందినీరెడ్డి దర్శకత్వంలో సిద్ధార్థ సరసన ఓ సినిమాలో బుక్కయింది. తాజాగా అల్లు అర్జున్ తాను బొమ్మరిల్లు భాస్కర్ తో తీయబోయే సినిమాలో సమంతను బుక్ చేసుకున్నాడు. ఇలా వరుస అవకాశాలతో టాలీవుడ్ నెం.1 స్థానానికి చేరుకుంది సమంత.


Click it and Unblock the Notifications











