వేణు మాధవ్ తల్లి షాకింగ్ కామెంట్స్: ఆ చెడ్డ అలవాటు వల్లే చనిపోయాడు.. చిన్న తప్పు ప్రాణం తీసిందంటూ!

ఊహించని విధంగా సినిమా రంగంలోకి అడుగు పెట్టి.. చాలా తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుని.. స్టార్ కమెడియన్‌గా సత్తా చాటాడు వేణు మాధవ్. తనదైన కామెడీతో సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకులను అలరించిన అతడు.. అకస్మాత్తుగా ప్రాణాలను విడిచాడు. అప్పటి నుంచి ఆయన మరణంపై ఎన్నో రకాల వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వేణు మాధవ్ తల్లి ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అసలు ఆయన మరణానికి కారణం ఏంటో చెప్పారు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

వేణు మాధవ్ మృతితో విషాదం

వేణు మాధవ్ మృతితో విషాదం

దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్‌గా హవాను చూపించిన వేణు మాధవ్.. ఊహించని విధంగా 2019 సెప్టెంబర్ 25వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. వేణు మాధవ్ మరణం ఆయన అభిమానులకే కాకుండా ఇండస్ట్రీకే విషాదాన్ని నింపింది.

వేణు మరణంపై ఎన్నో పుకార్లు

వేణు మరణంపై ఎన్నో పుకార్లు

హాస్యనటుడు వేణు మాధవ్ మరణించిన తర్వాత.. ఆయన చావు గురించి ఎన్నో రకాల ప్రచారాలు వైరల్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఆయన తాగుడు, స్మోకింగ్ లాంటి వ్యసనాలకు అలవాటు పడి చనిపోయారనే ప్రచారం జరిగింది. మరికొందరైతే వేణు మాధవ్ ఓ ప్రాణాంతకమైన వ్యాధి కారణంగా మృతి చెందారని కూడా అన్నారు. దీంతో ఇది అప్పట్లో సంచలనం అయిపోయింది.

కొడుకులు.. భార్య క్లారిటీ ఇచ్చి

కొడుకులు.. భార్య క్లారిటీ ఇచ్చి

వేణు మాధవ్ చనిపోయిన బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు.. ఆయన మరణం గురించి వచ్చిన వార్తలు మరింత ఇబ్బంది పెట్టాయి. ఈ నేపథ్యంలో ఈ కమెడియన్ భార్య శ్రీవాణి, కొడుకులు సావికర్, ప్రభాకర్ తరచూ ఇంటర్వ్యూలు ఇవ్వడం.. అందులో ఆయన మరణానికి సంబంధించిన కారణాలు చెప్పారు. ఇలా ఆ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నాలు చేసుకొచ్చారు.

అసలు నిజం అదేనన్న భార్య

అసలు నిజం అదేనన్న భార్య

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు మాధవ్ భార్య శ్రీవాణి తన భర్త మరణంపై క్లారిటీ ఇచ్చారు. 'ఆయన నిజంగా చనిపోకముందే మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికితోడు ఆయనపై నెగెటివ్ ప్రచారం కూడా బాగా జరిగింది. అయితే, నిజానికి మా వారు డెంగ్యూ ఫీవర్ రావడం వల్లే మరణించారు. సరైన కేర్ తీసుకోకపోవడం ఆయన ప్రాణం మీదకు తీసుకొచ్చింది' అన్నారు.

కష్టాల్లో మదర్.. ఇంటర్వ్యూతో

కష్టాల్లో మదర్.. ఇంటర్వ్యూతో

వేణు మాధవ్ సినీ రంగంలో చాలా తక్కువ సమయంలోనే మంచి పేరును దక్కించుకోవడంతో పాటు ఎంతో డబ్బు కూడా సంపాదించారు. కానీ, ఆయన మరణం తర్వాత తల్లి సావిత్రమ్మ ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానెల్ ఆమె దుర్భర జీవితాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఇంటర్వ్యూ చేసింది. ఇందులో ఆమె ఎన్నో విషయాలు చెప్పారు.

నా కొడుకు అలా పైకి వచ్చాడు

నా కొడుకు అలా పైకి వచ్చాడు

తాజా ఇంటర్వ్యూలో సావిత్రమ్మ మాట్లాడుతూ.. 'నాకు ముగ్గురు మగ పిల్లలు. వేణుమాధవ్ చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ గా ఉండే వాడు. మిమిక్రీ అయితే చాలా బాగా చేసేవాడు. అప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి గారు వాడిలోని టాలెంట్లను గుర్తించి సినిమాలో అవకాశాలు ఇచ్చారు. వాటిని వేణుమాధవ్ బాగా ఉపయోగించుకుని పైకి వచ్చాడు' అని చెప్పుకొచ్చారు.

వాడికి చెడ్డ అలవాటు ఉంది

వాడికి చెడ్డ అలవాటు ఉంది

వేణు మాధవ్ మరణం గురించి సావిత్రమ్మ మాట్లాడుతూ.. 'వేణు మాధవ్ పోయిన దానికంటే వాడి గురించి వచ్చిన వార్తలు మమ్మల్ని బాగా ఇబ్బందికి గురి చేశాయి. నిజానికి వేణు చనిపోవడానికి కారణం అనారోగ్యానికి గురి అవడంతో పాటు మందులు వేసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉండడమే. ఆ చెడ్డ అలావాటే వాడిని మాకు దూరం చేసేసింది' అని వెల్లడించారు.

చిన్నప్పటి నుంచి అదే పని

చిన్నప్పటి నుంచి అదే పని

వేణు మాధవ్ గురించి సావిత్రమ్మ వివరిస్తూ.. 'వేణు మాధవ్ ఎప్పుడు ఏ జబ్బు వచ్చినా మందులు వేసుకునే వాడు కాదు. చిన్నప్పటి నుంచి అదే అలవాటు వచ్చింది. అదే పెద్దయ్యాక కూడా కొంప ముంచింది' అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి డెంగ్యూ జ్వరం రావడం.. మందులు వాడకపోవడం వల్లే వేణు మాధవ్ ప్రాణాలు విడిచినట్లు ఆమె కూడా తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X