11 అంతస్థుల పైనుంచి పడింది.. కారు ధ్వంసం.. హీరోయిన్‌కి ఘోరమైన పరిస్థితి
Recommended Video
ఒక్కోసారి ఊహించని సంఘటనలు షాకిస్తుంటాయి. అకారణంగా జరిగిన ఆ సంఘటనలు ఆర్థిక నష్టంతో పాటు మానసికంగా కూడా ప్రభావితం చేస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన ఎదుర్కొందట హీరోయిన్ మౌని రాయ్. ఆ విషయాన్ని తెలుపుతూ అందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది మౌని. వివరాల్లోకి పోతే..

కారులో వెళ్తూ సిగ్నల్ దగ్గర ఆగగానే..
షూటింగ్ నిమిత్తం ఎప్పటిలాగే తన కారులో ముంబై లోని జుహు వైపుగా వెళుతోంది మౌని రాయ్. అలా రోడ్డుపై వెళుతుండగా ఓ సిగ్నల్ దగ్గర రెడ్ సిగ్నల్ పడటంతో ఆమె ఆగింది. ఇంతలో పైనుంచి పెద్ద బండరాయి పడటంతో ఒక్కసారిగా షాక్ అయింది మౌని రాయ్.

11వ అంతస్తు నుంచి పడడంతో
11వ అంతస్తు నుంచి ఆ రాయి పడడంతో కారు పై భాగంలో ఉన్న అద్దం పగిలిపోయింది. అయితే ఈ సంఘటనలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఈ విషయాన్ని మౌనీనే స్వయంగా తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ఈ మేరకు కారు ధ్వంసమైన వీడియో కూడా పోస్ట్ చేసింది.

మౌని రాయ్ ట్వీట్
''జుహు సిగ్నల్ వద్ద నేను రెడ్ సిగ్నల్ పడడంతో నా కారును ఆపాను. ఇంతలో ఉన్నట్టుండి ఓ పెద్ద బండరాయి నా కారుపై పడింది. 11 అంతస్తులపై నుంచి పడడంతో కారుపై భాగం దెబ్బతింది'' అంటూ తన ట్వీట్‌లో ట్యాగ్ చేసింది మౌని రాయ్. మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచి ఇలా బయటపడింది హీరోయిన్.
మౌని రాయ్ ఆవేదన
తనకు జరిగిన ఈ సంఘటనపై స్పందించిన మౌని రాయ్ ఆవేదన చెందింది. ''ఈ దారి వెంట చాలా మంది వస్తూ పోతూ ఉంటారు. ఒకవేళ నా కారుపైన కాకుండా.. ఎవరిపై అయినా పది ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ముంబై మెట్రో పనులు ఎంత బాధ్యతారహిత్యంగా కొనసాగుతున్నాయో చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ'' అని మౌని రాయ్ తెలిపింది.


Click it and Unblock the Notifications











