చైతూ అతిభయస్తుడు.. జంగిల్‌బుక్‌లో పామును చూసి కూడా.. సమంత

By Rajababu

దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాలెంటెడ్ హీరోయిన్‌గా ప్రేక్షకుల హృదయాలను దోచుకొన్న సమంత ప్రస్తుతం అక్కినేని కుటుంబంలో సభ్యురాలుగా మారింది. అక్కినేని కుటుంబంలో సభ్యురాలిగా మారిన నేపథ్యంలో మామ నాగార్జునతో సమంత కలిసి నటించిన చిత్రం రాజుగారి గది2 ఇటీవల విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్‌లో నాగార్జునతో కలిసి పాల్గొన్న సమంత ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. వారిద్దరూ వెల్లడించిన విషయాలు ఏమిటంటే..

 మీసం లేకుంటే గుర్తుపట్టలేకపోతున్నా

మీసం లేకుంటే గుర్తుపట్టలేకపోతున్నా

పెళ్లికి ముందు మీసం మామయ్య నాగార్జున మీసం తీసేశారు. మీసం లేకుంటే నాగార్జున, చైతన్య ఒకేలా ఉన్నారు. చీకట్లో వారిద్దరిని గుర్తు పట్టడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి నాగార్జున ఎవరో చైతూ ఎవరో గుర్తుపట్టడం ఇబ్బందిగా ఉంటుంది. నాకే కాదు చాలా మందికి ఈ సమస్య ఎదురవుతున్నది. పొరపాటుపడి క్షమించండి అని అంటున్నారు.

 చైతూ అతిభయస్తుడు

చైతూ అతిభయస్తుడు

నాగ చైతన్య చాలా భయస్తుడు. జంగిల్ బుక్‌ చిత్రంలో పామును చూసి కూడా బయపడుతాడు. చిన్న పిల్లలు ఎంజాయ్ చేసి చూస్తారు. నువ్వేంటి అంత భయపడతావు అని అడుగుతాను అని సమంత వెల్లడించింది.

Recommended Video

Pawan And Trivikram Given Surprize Gift To Samantha ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలిస్తే షాక్ అవుతారు..
 హీరోయిన్లు పారిపోయారు

హీరోయిన్లు పారిపోయారు

రాజుగారి గది2 సినిమాలో సమంత పాత్ర గురించి నాగార్జున ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. సమంత పాత్రకు ముందు కొందరు హీరోయిన్లను పరిశీలించారు. దెయ్యం కథ అని చెప్పి వారంతా పారిపోయారు. కథ కూడా వినడానికి భయపడ్డారు. కానీ సమంత కథ వినడమే కాదు, యూనిట్ గురించి తెలుసుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని నాగార్జున పేర్కొన్నారు.

 ట్రైలర్ చూడటానికి భయపడ్డాడు

ట్రైలర్ చూడటానికి భయపడ్డాడు

నాగచైతన్య కూడా రాజుగారి గది2 సినిమా ట్రైలర్ చూడటానికి బయపడ్డాడు. సమంత దెయ్యం అని ట్రైలర్ చూడలేదు. పెళ్లి సమయంలో చైతూ స్నేహితులంతా వాడికి కూర్చోపెట్టి బలవంతంగా ట్రైలర్ చూపించారు. చైతూ, అఖిల్‌కు ఇంత భయం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు.

 అమ్మాయిల అశ్లీల వీడియోలు

అమ్మాయిల అశ్లీల వీడియోలు

సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొనే ఓ సమస్యను ఆధారంగా రాజుగారి గది2 సినిమా రూపొందించింది. మొబైల్ టెక్నాలజీ సులభంగా అందుబాటులోకి రావడంతో అమ్మాయిలకు సంబంధించిన అశ్లీల ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో ప్రచారం చేస్తున్నారు అని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు.

 చైతూ ప్రస్తావన తీసుకొచ్చేది..

చైతూ ప్రస్తావన తీసుకొచ్చేది..

పెళ్లికి ముందు చైతూ, సమంత రిలేషన్‌పై కొంత అనుమానం వచ్చింది. మనం సినిమా షూటింగ్‌లో చైతూ ప్రస్తావన నావద్ద ఎక్కువగా తీసుకొచ్చేది. మా మధ్య పరిచయం పెరగడంతో మా ఇంటికి రమ్మని ఆహ్వానించాను. అయితే నేను ఎప్పుడో మీ ఇంటికి వచ్చాను అని చెప్పడంతో షాక్ తిన్నాను అని నాగార్జున చెప్పారు.

 అమృత పాత్రలో సమంత

అమృత పాత్రలో సమంత

నాగార్జున, సమంత, సీరత్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాజుగారి గది 2' శుక్రవారం విడుదలైంది. ఓంకార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత ‘అమృత' అనే పాత్రలో కనిపించారు. కుటుంబ ప్రేక్షకులు చూడదగిన చిత్రంగా దర్శకుడు ఓంకార్‌ దీన్ని తీర్చిదిద్దారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X