చేతులు లేకపోయినా పవన్ కళ్యాణ్ బొమ్మ వేసిన లేడి ఫ్యాన్.. మరచిపోకుండా సర్‌ప్రైజ్ ఇచ్చిన పవర్ స్టార్!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అభిమానులు ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకవిధంగా రాజకీయాల్లో ఆయనకు చేదు అనుభవం ఎదురైనప్పటికీ కూడా ఎంతో బలంగా పోరాడుతున్నారు. ఇలాంటి ఫలితాలు వస్తే ఏ రాజకీయ నాయకుడు అయినా సరే మళ్లీ రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడరు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అధికారం కోసం కాకుండా తనదైన శైలిలో ప్రశ్నించేందుకు ముందుకు సాగుతున్నాడు. చాలామంది అభిమానులు మాత్రం ఆయనను చాలా మనస్ఫూర్తిగా అభిమానిస్తారు అని అందరికీ తెలిసిన విషయమే. అయితే చేతులు లేని ఒక యువతి పవన్ కళ్యాణ్ బొమ్మలు గీసి అన్నయ్య అంటూ తన అభిమానాన్ని చాటుకున్న విధానం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఆమెకు గతంలో మాట ఇచ్చినట్లుగానే పవన్ కళ్యాణ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

పవన్ చెప్పేది ఒక్కటే..
కొంతమంది అభిమానులు వారి హీరోల కంటే కూడా ఇతర హీరోలను ఎక్కువగా తిడుతూ ఉంటారు కానీ నిజానికి హీరోలు కోరుకునేది అలాంటి వారిని కాదు. అందరితోనూ సఖ్యతగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. చాలా సినిమా వేడుకల్లో ప్రతి ఒక్క స్టార్ హీరో కూడా అభిమానులకు ఇది ఎక్కువగా చెబుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా అలాంటి మంచి అభిమానులను ఎంతగానో ఇష్టపడతాడు. చాలా సందర్భాలలో తనను నిజంగా ప్రేమించే వారిని కూడా పవన్ ప్రత్యేకంగా కలుసుకునేందుకు ఇష్టపడతారు.

అభిమానుల చెల్లి..
అయితే గత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ ను చూడాలని ఒక యువతి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే ఆమె కోరిక తీర్చాడు. చేతులు లేకపోయినా కూడా పవన్ బొమ్మ వేసి ఆమె తన అభిమానాన్ని చాటుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటోను ఎంతో చక్కగా డ్రా చేసింది. తరచుగా ఆమె పవర్ స్టార్ పై తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటున్నారు. ముఖ్యంగా పుట్టినరోజు సందర్భంగా కూడా తన పవర్ స్టార్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానుల చేత చెల్లి అని పిలిపించుకున్నారు.

నోటితోనే బొమ్మలు గీసి
ఆ యువతి పేరు స్వప్నిక. సోషల్ మీడియాలో మౌత్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు అందుకుంది. చేతులు లేకపోయినా నోటి తోనే డ్రాయింగ్, పెయింటింగ్స్ వేస్తూ తన టాలెంట్ ను ప్రపంచానికి చాటి చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళంకు చెందిన స్వప్నిక మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. సోషల్ మీడియాలో కూడా పవన్ సిస్టర్ అంటూ అభిమానాన్ని చాటుకుంటోంది. అయితే గతంలో ఆమె గీసిన బొమ్మలు చూసిన పవర్ స్టార్ సోషల్ మీడియా ద్వారా చాలా పాజిటివ్ గా స్పందించారు. 'నా బంగారు తల్లి స్వప్నిక నువ్వు వేసిన నా డ్రాయింగ్ నా దృష్టికి మన జన సైనికులు తీసుకు వచ్చారు. చాలా చక్కగా ఉండాలి తల్లి. నేను విశాఖపట్నం వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను.. జాగ్రత్త అమ్మ' అంటూ పవన్ గతంలో ఒకసారి ఆమెకు ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు.
Recommended Video

అన్నయ్యను కలుసుకున్న స్వప్నిక
ఇక ఇటీవల వైజాగ్ వెళ్లిన పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే స్వప్నికను ప్రత్యేకంగా కలుసుకున్నాడు. అంతే కాకుండా స్వప్నిక ఇచ్చిన సరికొత్త డ్రాయింగ్ ను పవర్ స్టార్ చాలా ఆప్యాయంగా తీసుకున్నారు. ఆమె జీవితం గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక అభిమాన హీరోను కలిసినందుకు స్వప్నిక ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు. అన్నయ్యను ఈ రోజూ వైజాగ్ లో కలిశాను. చాలా సంతోషంగా ఉంది అంటూ.. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆమె పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











