twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజీనామాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న మంచు విష్ణు.. మా బిల్డింగ్ మీద వారంలో ప్రకటన?

    |

    గత కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు హోరాహోరీగా జరిగిన సంగతి తెలిసిందే. అసోసియేషన్ ఎన్నికలలో ప్రకాష్ రాజు ప్యానల్, మంచు విష్ణు ప్యానల్ పోటీపడగా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి 11 మంది సభ్యులు గెలుపొందిన సంగతి తెలిసిందే. గెలుపొందిన వెంటనే రాజీనామాలు కూడా చేయగా దాని మీద ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    ఉచితంగా చికిత్స

    ఉచితంగా చికిత్స

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ఆర్టిస్టులకు ఉపయోగపడే విధంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆదివారం నాడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా సభ్యులు అందరికీ ఉచితంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మెడికవర్ హాస్పిటల్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ఉచిత హెల్త్ చెకప్ క్యాంపులో ఏదైనా అనారోగ్య సమస్యలు బయటపడితే మెడికవర్ హాస్పిటల్స్ అందుకోసం ఉచితంగా చికిత్స అందించనుంది.

    ప్రతి ఏడాది ఇదే సమయంలో

    ప్రతి ఏడాది ఇదే సమయంలో

    ఇదే విషయం గురించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు మాట్లాడుతూ మొత్తం 914 మంది సభ్యులకు వివిధ రకాల మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకునే అవకాశం ఉందని, మా అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేసిన దగ్గర్నుంచి మాదాల రవి దగ్గర ఉండి అన్నీ చూసుకున్నారని అన్నారు.

    మెడికవర్ హాస్పటల్ వారు ముందుకు వచ్చి ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తున్నారు. అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ రెండో వారంలో ఈ హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని మంచు విష్ణు వెల్లడించారు. మెడికవర్ వాళ్ళు ఫిల్మ్ జర్నలిస్ట్ లకు కూడా ఉచితంగా హెల్త్ చెకప్ లు చేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతున్నానని ఆయన అన్నారు.

    వారం రోజుల్లో ప్రకటన...

    వారం రోజుల్లో ప్రకటన...

    ఇక మా బిల్డింగ్ నిర్మాణమే ప్రధాన అజెండాగా ఎన్నికల్లో పోటీ చేసిన మంచు విష్ణు తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కోసం చర్చలు జరుగుతున్నాయని, 'మా' కమిటీ మీటింగ్ జరిగిందని, వారం రోజుల్లో మా బిల్డింగ్ పై ప్రకటన చేస్తామని వెల్లడించారు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ లో పోటీ చేసి, గెలుపొందిన 11మంది సభ్యులు రాజీనామా చేశారని, రాజీనామాలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరానని అన్నారు. కానీ వారు అందుకు సిద్ధంగా లేకపోవడంతో నెల రోజుల పాటు వెయిట్ చేసి, రాజీనామాలను అంగీకరించడం జరిగిందన్నారు.

    వాళ్ల రాజీనామాకు గ్రీన్ సిగ్నల్

    వాళ్ల రాజీనామాకు గ్రీన్ సిగ్నల్

    మా అసోసియేషన్ వర్క్స్ కోసం వారి స్థానంలో కొత్త సభ్యులను తీసుకున్నాను. అయితే వారు పదవుల్లో లేకున్నా 'మా' సభ్యులుగా కొనసాగుతారన్నారు..ఇక నాగబాబు, ప్రకాష్ రాజు కూడా 'మా' సభ్యులుగా కొనసాగుతారనీ ఆయన అన్నారు. 'మా' జనరల్ సెక్రటరీ రఘుబాబు మాట్లాడుతూ హెల్త్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్, దానిని ఫస్ట్ ప్రయార్టీగా తీసుకుని, సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు 'మా' ప్రెసిడెంట్ విష్ణు. ముందుముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు విష్ణు ఆధ్వర్యంలో సక్సెస్ ఫుల్ గా జరుగుతాయన్నారు.

    Recommended Video

    Comedian Ali Birthday Celebrations
    సద్వినియోగం చేసుకోవాలి

    సద్వినియోగం చేసుకోవాలి

    'మా' ట్రెజరర్ గా మాట్లాడుతూ హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ, మా సభ్యులు అందరూ దీనిని ఉపయోగించుకోవాలి. 'మా' సభ్యుల హెల్త్ కోసం తీసుకున్న ఈ నిర్ణయంలో 'మా' ప్రెసిడెంట్ విష్ణు సక్సెస్ అయ్యారన్నారు. ఇక మా' వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ మా సభ్యుల ఆరోగ్యం ముఖ్యం, సామాజిక స్పృహతో పనిచేస్తున్న మెడికవర్ హాస్పటల్ కి కృతజ్ఞతలని అన్నారు. చాలా హాస్పటల్స్ తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఉచితంగా మాస్టర్ హెల్త్ చెకప్ చేయడానికి మెడికవర్ హాస్పటల్ ముందుకు వచ్చింది. అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

    English summary
    movie artist association president Manchu Vishnu approves Prakash Raju panel's resignations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X