twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మా' అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నా.. నరేష్ సంచలన వ్యాఖ్యలు

    |

    తెలుగు చిత్రసీమ లోని నటీనటుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో వివాదాలు భగ్గుమంటున్నాయి. గత కొంతకాలంగా 'మా'లో జరుగుతున్న పరిణామాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో 'మా' అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధం అంటూ నరేష్ ఓపెన్‌గా చెప్పేయడం హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు చూద్దామా..

    'మా' అధ్యక్షుడు నరేష్‌పై మండిపాటు

    'మా' అధ్యక్షుడు నరేష్‌పై మండిపాటు

    ప్రస్తుతం మా అసోసియేషన్‌‌ అధ్యక్షుడుగా కొనసాగుతున్న నరేష్‌పై అదే 'మా'కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న రాజశేఖర్, సెక్రటరీగా ఉన్న జీవిత విరుచుకుపడిన విషయం తెలిసిందే. గత 9 నెలలుగా 'మా'లో ఏం జరుగుతుంది ? ఎంత ఫండ్ వచ్చింది? మా నుంచి ఎలాంటి ఈవెంట్లు జరుగుతున్నాయి? అనే అంశాలపై జీవిత, రాజశేఖర్ అనుమానాలు వ్యక్తం చేశారు.

    మరోసారి భగ్గుమన్న 'మా' వివాదాలు

    మరోసారి భగ్గుమన్న 'మా' వివాదాలు

    గతంలో మా అసోసియేషన్ అధ్యక్షుడిగా శివాజీ రాజా ఉన్నప్పుడు కూడా ఇలాగే పలు విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇక ఇప్పుడు నరేష్ 'మా' అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు కాబట్టి ఆ వివాదాలు సద్దుమణుగుతాయని అంతా అనుకున్నారు, కానీ ఉహించినదానికి భిన్నంగా మరోసారి 'మా' వివాదాలు భగ్గుమన్నాయి.

    సినీ ప్రముఖులు ఆశ్చర్యపోయేలా..

    సినీ ప్రముఖులు ఆశ్చర్యపోయేలా..

    'మా' అధ్యక్షుడిగా నరేష్ ఎన్నికైన తర్వాత కొన్ని రోజులపాటు సైలెంట్ గానే ఉండటంతో ఇక 'మా'లో వివాదాలకు తావులేదని అనుకున్నాం. కానీ ఇంతలో మరోసారి మా విభేదాలు తారస్థాయికి చేరడం సినీ ప్రముఖులను ఆశ్చర్యపరిచాయి. మా అధ్యక్షుడు నరేష్ లేకుండానే జనరల్ సెక్రటరీగా ఉన్న జీవిత రాజశేఖర్ బాడీ మీటింగ్ నిర్వహించడం మరిన్ని అనుమానాలను లేవనెత్తింది.

    నాకు శత్రువులు లేరు అంటూ నరేష్ సంచలనం

    నాకు శత్రువులు లేరు అంటూ నరేష్ సంచలనం

    సరిగ్గా ఈ తరుణంలో రఘుపతి వెంకయ్య నాయుడు సినిమా విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన 'మా' అధ్యక్షుడు నరేష్, ఆ వివాదాలపై స్పందించారు. మా అసోసియేషన్‌లో శత్రువులు లేరని, తాను అజాతశత్రువును అని నరేష్ అన్నారు.

    అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధం

    అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధం

    తాను 'మా' అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్బంగా నరేష్ తెలిపారు. అయితే తాను సభ్యుల ఓట్లతోనే అధ్యక్షుడుగా ఎన్నికయ్యానని, తనను మా అసోసియేషన్ నుంచి ఎవ్వరూ బయటకు పంపలేరంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు నరేష్.

    Recommended Video

    MAA President Naresh Condemns Sivaji Raja Comments On Nagababu || Filmibeat Telugu
    చిరంజీవి, కృష్ణంరాజు మురళీమోహన్‌ల సహకారం

    చిరంజీవి, కృష్ణంరాజు మురళీమోహన్‌ల సహకారం

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది రాజకీయ పార్టీ కాదని, దీనిని కేవలం సేవా సంస్థగా మాత్రమే భావించాలని నరేష్ పేర్కొన్నారు. చిరంజీవి, కృష్ణంరాజు మురళీమోహన్ లాంటి పెద్దల సహకారంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నడుతోందని ఆయన అన్నారు. మా అధ్యక్షుడిగా తాను ఎన్నికైన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని నరేష్ తెలిపారు. చూడాలి నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై మా సభ్యులు ఎలా స్పందిస్తారో!.

    English summary
    Once again contraversy took place in MAA. VK Naresh reacts on MAA contraversy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X