మంచు విష్ణు సంచలన నిర్ణయం.. మా నుంచి నటి హేమ సస్పెండ్
సాఫీగా సాగిపోతున్న నటి హేమ జీవితం ఒకే ఒక్క తప్పుతో అల్లకల్లోలంగా మారింది. బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అడ్డంగా బుక్ అయ్యింది. పోలీసులు ఆమెను నిందితురాలిగా గుర్తించి విచారణకు హాజరు కావాలని కూడా తెలిపారు. అయితే బెంగుళూరు రేవ్ పార్టీలో తాను లేనని హేమ వీడియో బైట్ విడుదల చేసింది. నేను హైదరాబాద్ లో ఒక ఫార్మ్ హౌస్ లో చిల్ అవుతున్నాను. బెంగుళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవన్నీ పుకార్లు మాత్రమే. మీరు నమ్మకండి అని బుకాయిస్తునే వచ్చింది.
ఇక దీంతో పోలీసులు రెండు సార్లు విచారణకు రావాలని నోటీసులు పంపగా ఆమె రెండోసారి విచారణకు హాజరయ్యింది. విచారణ అనంతరం ఆమెను బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఆమెకు సపోర్ట్ గా ఉన్న మా ప్రెసిడెంట్ సైతం ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేశాడు. హేమ.. ఈ కేసులో ఇరుక్కుంది అన్నప్పుడు విష్ణునే సపోర్ట్ గా నిలబడ్డాడు. నిజానిజాలు తెలియకుండా మాట్లాడొద్దని చెప్పుకొచ్చాడు.

ట్విట్టర్ ద్వారా హేమకు తన మద్దతు తెలిపిన విష్ణు హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్ధోషిగానే భావించాలన్నాడు.ఆమె ఇమేజ్ ను దెబ్బతీయడం అన్యాయమని ..పోలీసులు కచ్చితమైన సాక్ష్యాలను అందజేస్తే ఆమెపై మా తగిన చర్యలు తీసుకుంటుందని అప్పటి వరకు నిరాధారమైన వార్తలను ప్రసారం చేయవద్దని మీడియాను కోరాడు.
ఇక హేమను పోలీసులు అరెస్ట్ చేసిన తరువాత విష్ణు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయడంతో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు హేమపై తీసుకోవాల్సిన చర్యలపై సభ్యుల అభిప్రాయాలను కోరారు. ఎక్కువ మంది సభ్యులు హేమను సస్పెండ్ చెయ్యాల్సిందే అంటూ రిప్లయ్ ఇచ్చారు.
మా అసోసియేషన్ కు చెడ్డపేరు రాకుండా ఉండాలంటే ఆమెను సస్పెండ్ చేయాలని ఎక్కువమంది సభ్యులు కోరడంతో విష్ణు హేమను సస్పెండ్ చేశాడు. ఆమెకు క్లీన్‌చిట్ వచ్చేంత వరకు సస్పెండ్ కొనసాగనుంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
ఇంత జరిగినా కూడా హేమ తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం విశేషం. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుంలుతున్న సమయంలో కూడా ఆమె.. నేను రేవ్ పార్టీలో లేను.. బిర్యానీ వీడియో ఇంటి నుంచే పంపాను అంటూ రచ్చ చేసింది.
ఇక సస్పెండ్ వేటు పోవాలి అంటే.. క్లీన్ చీట్ రావాలి. అప్పటివరకు ఆమె ఎలాంటి సినిమాల్లో నటించడానికి వీల్లేదు. హేమ చేసిన ఈ పొరపాటు ఆమె జీవితాన్నే నాశనం చేసింది. మరి ముందు ముందు ఈ హేమ ఈ పెద్ద సమస్యనుంచి బయటపడుతుందో.. లేదో తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











