twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మా’ నూతన కార్యవర్గం తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు ఇవే!

    |

    మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా నరేష్, ప్రధాన కార్యదర్శిగా జీవిత, నూతన కార్యవర్గం ఎన్నికైన తర్వాత తొలి జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఏప్రిల్ 11న జరిగిన తొలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. కొత్త కార్యవర్గం పదవిలో ఉండే రెండేళ్లు (2019-2021) ఈ నిర్ణయాలు అమలవుతాయి.

    'మా' ద్వారా పింఛను పొందే వారు ఇకపై రూ. వెయ్యి అదనంగా... అంటే రూ. 6 వేలు పొందుతారు. ఈ డబ్బు నేరుగా వారి ఖాతాలో జమచేస్తారు. పింఛను తీసుకునే వారిలో ఎక్కువ నిరు పేద కళాకారులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారే ఉండటంతో వారికి మరింత ఆసరాగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

    కొత్తగా సభ్యులుగా చేరాలనుకునే వారి కోసం రెండు విధానాలు ప్రవేశ పెట్టారు. శాశ్వత సభ్యత్వ రుసుము రూ. లక్ష ఉండగా... ఒకేసారి ర. 90 వేలు కడితే రూ. 10 వేలు రాయితీ లభిస్తుంది. అంత డబ్బు చెల్లించలేనివారు మొదట రూ. 25 వేలు చెల్లించి రెండేళ్ల కాలపరిమితి ఉన్న గోల్డ్ కార్డ్ తీసుకోవాలి. ఈ రెండేళ్లలో మిగతా రూ. 75 వేలు కడితే శాశ్వత సభ్యత్వం లభిస్తుంది.

     Movie Artists Association Announces Key Resolutions

    కొత్త పద్దతిలో సభ్యత్వం తీసుకునే అవకాశం 100 రోజులు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత యదావిధిగా రూ. 1 లక్ష సభ్యత్వం రుసుము కొనసాగుతుందని నరేష్, జీవిత వెల్లడించారు. శాశ్వత సభ్యులకు మాత్రమే 'మా' పథకాలు వర్తిస్తాయని, అయితే గోల్డ్ కార్డ్ కలిగిన వారికి ఫ్రీ మెడికల్ క్యాంపుకు ఎలిజబిలిటీ ఉంటుందని తెలిపారు. మా సభ్యులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చేయనున్నారు.

    'మా' సభ్యులందరికీ ఇప్పటి వరకు రూ.2 లక్షలు ఎస్‌బీఐ సంపూర్ణ సురక్షా జీవిత బీమాను ఉండేది. ఇకపై ఈ భీమా మొత్తం రూ. 3 లక్షలకు చేరేలా నిర్ణయం తీసుకున్నారు. సభ్వులు సమస్యలు ఉంటే అసోసియేషన్లో ఏర్పాటు చేసిన బాక్సులో రాసి వేయాలని, ఎమర్జెన్సీ సమయాల్లో హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 9502030405కి సంప్రదించాలని తెలిపారు.

    English summary
    The first Executive Committee Meeting of newly formed Movie Artists Association (MAA) body was held on April 11th. In this meeting key resolutions were taken. Naresh Vijay Krishna is the new President of MAA while Executive Vice President is Rajasekhar and General secretary is Jeevitha Rajasekhar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X