twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనుషుల ప్రాణాలతో ఆటా? మాఫియా... ‘మా’ కుర్చీ దిగనంటున్న శివాజీ రాజాపై నరేష్ ఫైర్!

    |

    'మా' అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు నరేష్ ఎన్నికైన సంగతి తెలిసిందే. మార్చి 22న కొత్త కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతుండగా... మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా మార్చి 31 వరకు తాను పదవిలో ఉంటున్నాను, అప్పటి వరకు ఎవరూ ప్రెసిడెంట్ కుర్చీని టచ్ చేయకూడదు అని చెప్పడంతో కొత్త వివాదం మొదలైంది.

    శివాజీ రాజా అలా చేయడంపై నరేష్ స్పందిస్తూ... ''సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఇలా అందరి మద్దతుతో మా ప్యానల్ గెలుపొందింది. మార్చి 22 మంచి రోజు కాబట్టి ప్రమాణ స్వీకారం ప్లాన్ చేశాం. మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి మార్చి 31 వరకు నేను పదవిలో ఉన్నాను. అప్పటి వరకు ఎవరూ అక్కడ కూర్చోవడానికి లేదు. అప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు జరుగడానికి వీల్లేదు. నేను కోర్టుకు వెళతాను అని చెప్పడం జరిగింది, అతడు అలా చేయడం సరైంది కాదు'' అని తెలిపారు.

    గత టర్మ్‌లో నన్ను పని చేయలేదు

    గత టర్మ్‌లో నన్ను పని చేయలేదు

    గత టర్మ్ లో జనరల్ సెక్రటరీగా నన్ను పని చేయనీయలేదు. అవకతవకలు జరిగాయి. రెండు సంవత్సరాల ఆడియో రికార్డ్ కొన్ని కారణాల వల్ల మాయమైపోయందని చెప్పాను. ఇవన్నీ నేను చెప్పకూడదు అనుకున్నాను. మీడియా వారు అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తోందని నరేష్ వ్యాఖ్యానించారు.

    మనుషుల ప్రాణాలతో ఆడటం కరెక్టా?

    మనుషుల ప్రాణాలతో ఆడటం కరెక్టా?

    నాకు అన్ని విషయాలు తెలియవచ్చాయి. ఎక్స్‌పైర్ అయిపోయిన లైఫ్ ఇన్సూరెన్స్ ఫైల్ష్ చాలా ఉన్నాయి. మనిషి చనిపోతే వెంటనే ‘మా' నుంచి రూ. 2 లక్షలు ఇచ్చి క్లెయిమ్ చేసుకుంటాం. ఇది ఎక్స్‌పైరీ అయిపోయింది. దీని కారణంగా ఒక వ్యక్తి దురదృష్ట వశాత్తు చనిపోతే 2 లక్షల రూపాయలు ‘మా' ఇవ్వడానికి ఉండదు. ఆఫీసులో సురేష్ అనే వ్యక్తిని అడిగితే అందరి ముందు చెప్పారు. రూ. 2 లక్షలు రూ. 3 లక్షలు చేయబోతున్నాం. కాబట్టి నేను వచ్చిన తర్వాతే చేద్దాం అని శివాజీ అన్నారట. ఇది కరెక్టా? మనుషుల ప్రాణాలతో ఆడటం కరెక్టా? ఇలాంటివి చాలా ఉన్నాయన్నారు.

    నాకు కుర్చీ పిచ్చి లేదు

    నాకు కుర్చీ పిచ్చి లేదు

    నాకు కుర్చీ పిచ్చి మాకు లేదు. ప్రమాణ స్వీకారం కోసం 10 రోజులు కాదు 20 రోజులైనా ఆగుతాం. లీగల్‌గా మాకు హక్కు ఉంది. ఇది శుభకార్యం. సాధారణంగా ఒక ప్రెసిడెంట్ ఓడిపోయినపుడు గౌరవంగా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేసి మేము మీతో ఉంటామని చెప్పి చార్జ్ ఇచ్చేసి వెళ్లిపోతారు. ఇంతకు ముందు మురళీ మోహన్ గారు ఓడిపోయినపుడు అలాగే చేశారని నరేష్ గుర్తు చేశారు.

    ఎందుకు అడ్డు పడుతున్నారు?

    ఎందుకు అడ్డు పడుతున్నారు?

    నేను పేర్లు చెప్పను కానీ... చెక్కులు పెండింగులో ఉన్నాయి.. సైన్ చేయండి అంటే మేము పెట్టము అని చెప్పారట. ఇవన్నీ మాట్లాడకూడదు.. కానీ మాట్లాడాల్సి వస్తోంది. ‘మా' ఇంటి గుట్టుకోసం ఈ ఫైల్ విషయం బయట పెట్టకూడదు అనుకున్నాం. కానీ పెట్టాల్సి వచ్చింది. ఇలాంటివి చాలా ఉన్నాయి మేము చెప్పకూడదు, చెప్పలేను. ఒక శుభకార్య జరుగుతున్నపుడు.. మాకు ఆ రైట్ ఉన్నపుడు ఎందుకు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం ముందే చెప్పి ఉండొచ్చు కదా. ప్రమాణ స్వీకర ఫంక్షన్ కోసం ఫిల్మ్ నగర్ క్లబ్ బుక్ చేసి 500 మంది పెద్దలను భోజనాలకు పిలిచి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఎందుకు మీరు ఇలా అడ్డు పడుతున్నారని... శివాజీ రాజాను ఉద్దేశించి నరేష్ వ్యాఖ్యానించారు.

    'మా'లో ముదిరిన వివాదం.. కోర్టుకైనా వెళతా, కుర్చీ మాత్రం దిగనంటున్న శివాజీ రాజా!'మా'లో ముదిరిన వివాదం.. కోర్టుకైనా వెళతా, కుర్చీ మాత్రం దిగనంటున్న శివాజీ రాజా!

    అరుణాచలం వెళ్లిపోకుండా ఈ ప్రయత్నాలు ఏమిటి?

    అరుణాచలం వెళ్లిపోకుండా ఈ ప్రయత్నాలు ఏమిటి?

    మీ గురించి తీయాలనుకుంటే చాలా ఉన్నాయి. ‘మా' ఇంటి గుట్టు కోసం తీయను. కానీ ఎందుకు ఇలా హింస పెడుతున్నారు. మేము ఏం పాపం చేశాం. ఒక మార్పు కావాలని అడిగాం. మమ్మల్ని గెలిపించారు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నువ్వు అరుణాచలం వెళ్లిపోతాను అని చెప్పి చుట్టు పక్కల ఇక్కడే కూర్చుని... కొత్తగా ఎన్నికైన కమిటీని ఈ పది రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్ క్వాలిఫై చేయాలనే ప్రయత్నం జరుగుతోంది... అని నరేష్ ఆరోపించారు.

    మాఫియా కాకూడదు..

    మాఫియా కాకూడదు..

    కొంత మంది మెంబర్లను ఎలక్షన్ ముందే ఎత్తుకెళ్లడం జరిగింది. అవన్నీ మేము మాట్లాడదలుచుకోలేదు. ‘మా' అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ, పొలిటికల్ సంస్థ కాకూడదు, మాఫియా కాకూడదనే ఈ ఎలక్షన్ పెట్టామని నరేష్ తెలిపారు. 10 రోజులు ఆ కుర్చీని ముట్టుకోవద్దు అని శివాజీ రాజా అనడం నైతికంగా కరెక్ట్ కాదు అన్నారు.

    ఎన్నికల అధికారి ఏమంటున్నారంటే...

    ఎన్నికల అధికారి ఏమంటున్నారంటే...

    శివాజీ రాజా చెతున్నది కేవలం మోరల్. లీగల్ కాదు. లీగల్‌గా వెంటనే చార్జ్ తీసుకునే హక్కు కొత్త అధ్యక్షుడు నరేష్ గారికి ఉంది. ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తామో అప్పుడే అధ్యక్షుడు అధికారాలు అన్ని పోతాయి. ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత న్యూ ప్రెసిడెంట్ ఎన్నికైనట్లు. పాత ప్రెసిడెంటుకు ఎలాంటి పవర్స్ ఉండవు... అని ఎన్నికల అధికారి తెలిపారు.

    English summary
    Movie Artists Association New president Naresh Warning to Shivaji Raja.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X