Don't Miss!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్ బాబు ఇష్యూపై ‘మా’ సీరియస్: చర్యలు తీసుకోవాలంటూ నడిగర్ సంఘానికి లేఖ!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై తమిళ కమెడియన్ మనోజ్ ప్రభాకర్ చేసిన కామెంట్స్ విషయంలో తెలుగు సినిమా పరిశ్రమ సీరియస్ అయింది. మహేష్ బాబు యాక్టింగ్ టాలెంట్, పర్సనాలిటీని కించ పరిచే విధంగా అతడు చేసిన కామెంట్స్‌పై అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా) కూడా రంగంలోకి దిగింది. సదరు కమెడియన్ మీద తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ తమిళ సినీ నటులకు చెందిన 'నడిగర్ సంఘం'కు లేఖ రాసింది.
ఇంతకాలం అన్నదమ్ముల్లా ఉన్నాం
ఇంతకాలం మా, నడిగర్ సంఘం, అమ్మ, కలవిధార సంఘ... మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అందరం కలిసి మెలిసి పని చేస్తూ అన్నదమ్ముల్లా ఒకరికొకరు సాయం చేసుకుంటున్నాం. దక్షిణాది చలన చిత్ర రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందుకు గర్వంగా ఉంది. కానీ కొందరు మన మధ్య ఉన్న సత్సంబంధాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు... అంటూ ‘మా' తన లేఖలో పేర్కొంది.
అతడి కామెంట్స్ షాక్‌కు గురి చేశాయి
మనోజ్ ప్రభాకరన్ అనే కమెడియన్ మహేష్‌బాబుపై చేసిన వ్యాఖ్యలు మమ్మల్ని షాక్‌కు గురిచేశాయి. ఆయన యాక్టింగ్ టాలెంట్, వ్యక్తిత్వం గురించి చేసిన వ్యాఖ్యలు చాలా అమర్యాదకరంగా ఉన్నాయి.... అని ‘మా' ఆగ్రహం వ్యక్తం చేసింది.
మైత్రిని దెబ్బతీస్తాయి
మనోజ్ ప్రభాకరన్ చేసిన వ్యాఖ్యలు తమిళ పరిశ్రమతో ఉన్న మైత్రిని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఇది నడిగర్ సంఘంపై కూడా ప్రభావం పడుతుంది. ఇలాంటి విషయాలను ఊరికే వదిలేయకూడదు. తగిన విచారణ జరిపి అతడిపై మీరు చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాం. దశాబ్దాలుగా మన మధ్య కొన్నసాగుతున్న బ్యూటిఫుల్ రిలేషన్ షిప్ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాం... అని ‘మా' ప్రధాన కార్యదర్శి నరేష్ లేఖలో పేర్కొన్నారు.
సౌత్ సినీ పరిశ్రమలో ఇదే తొలిసారి
సౌత్ సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఒక పరిశ్రమకు చెందిన నటుడిపై మరొక పరిశ్రమకు చెందిన నటుడిని అవమానిస్తూ వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి. ఇలాంటివి కొనసాగితే విద్వేషాలు పెరిగిపోయి అందరూ నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఈ విషయాన్ని ‘మా' సీరియస్‌గా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
|
మహేష్ బాబు మీద దారుణమై కామెంట్స్
ఇటీవల ఓ అవార్డ్ ఫంక్షన్లో మనోజ్ ప్రభాకరన్ మాట్లాడుతూ... మహేష్ బాబుకు సరిగా నటన రాదని, ‘స్పైడర్' మూవీలో అతడి ఫేసులో ఎలాంటి హావభావాలు కనిపించలేదంటూ... కత్రినా కైఫ్‌తో కంపేర్ చేయడంతో పాటు బండరాయితో పోలుస్తూ తీవ్రమైన కామెంట్స్ చేశారు.