తెరపై వివాదాస్పద హీరోయిన్ బయోపిక్.. ఎవరా నటి అంటే!

మత్తెక్కించే అందాలతో 90ల్లోనే కుర్రకారుకు నిద్రపట్టకుండా చేసిన మమతా కులకర్ణీ, ఎక్కవ కాలం అలరించకుండానే తెరమరగైంది. అతి చిన్న సినీ కెరీర్ లోనే యువతను ఉర్రూతలూగించింది. టాప్ హీరోలతో స్టెప్పులేసింది. డేట్ల కోసం బడా దర్శక- నిర్మాతలను తన చుట్టూ తిప్పుకుంది. మొత్తానికి గ్లామర్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన మమత, అనాలోచిత నిర్ణయాలతో కనుమరుగైంది.

సినీ కెరీర్ తో పాటూ, వ్యక్తిగత జీవితంలోనూ లెక్కలేనన్ని వివాదాలు మూటగట్టుకున్న ఈ సుందరీమణి జీవితం శాంతం అల్లకల్లోలం. చైనా గేట్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన గొడవతో ఆమె కెరీర్ కు ఫుల్ స్టాప్ పడింది. భర్తతో పాటూ డ్రగ్ రాకెట్ లో ఇరుక్కుంంది. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది మమత. ఇప్పుడామే కథే వెండితెరకెక్కబోతోంది.

 Movie based on Sensational Star Mamta kulkarni, Nikhil Dwivedi all set to produce the film

వీరే ది వెడ్డింగ్, దబాంగ్ 3 వంటి సినిమాలను నిర్మించిన నిఖిల్ ద్వివేదీ, ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. మమత జీవితం ఆధారంగా బిలాల్ సిద్ధిఖ్కీ రచించిన స్టార్ డస్ట్ అఫైర్ నవల హక్కులను కొనుగోలు చేసిన నిఖిల్, త్వరలోనే చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించబోతున్నాడు. మరి కొద్ది రోజుల్లోనే లీడ్ హీరోయిన్ ను కన్ఫామ్ చేయనున్నారని తెలుస్తోంది. మరి మమత గ్రామర్ ను మరిపించే ముద్దుగుమ్మ ఎవరో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X