సంక్రాంతి కోడి పందాల్లో...సినీ సెలబ్రిటీలు

ఈ సారి పందాలకు అనుమతి లభించడంతో సీనీ నటులు ఆహుతి ప్రసాద్, చిన్నా, నిర్మాతలు కె.ఎస్. రామారావు, సి. కళ్యాణ్ తదితరులు పశ్చిమగోదావరి జిల్లా శ్రీరామ పురంలో జరిగే పందాలను స్వయంగా వీక్షించారు. ఈ సందర్భంగా నిర్మాత కె.ఎస్. రామారావు మాట్లాడుతూ...మా తాతల కాలం నుంచి కోడి పందాలు జరుగుతున్నాయని, ఇన్నాళ్లు ప్రభుత్వం ఆంక్షలు విధించడం వల్ల పందాల్లో పాల్లొనలేక పోయామని, ఇన్నాళ్లకు మళ్లీ ఆంక్షలు సడలించి సంప్రదాయ కోడి పందాలకు అనుమతి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఆహుతి ప్రసాద్ మాట్లాడుతూ...ఫస్ట్ టైమ్ పందాలు చూడటానికి వచ్చానని, పందాలు ఎంతో సరదాగా జరుగుతున్నాయని, చాలా బాగుందని అన్నారు. ఇలాంటి ఉంటేనే పండగ మూడ్ వస్తుందని వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











