twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంక్రాంతి కోడి పందాల్లో...సినీ సెలబ్రిటీలు

    By Bojja Kumar
    |

    Cock Competitions
    సంక్రాంతి పండగ వచ్చిందంటే పందెం రాయుళ్లకు ఎక్కడలేని ఊపు వస్తుంది. కాయ్ రాజా కాయ్ అంటూ కోడి పుంజులతో పందాలకు రెడీఅవుతారు. బరిలో కోళ్లు తలపడుతుంటే మొదలయ్యే సందడి అంతా ఇంతా కాదు. ఈ పందాల్లో లక్షలు, కోట్లు సంపాదించిన వారు కొందరైతే, భూములు, ఆస్తులు పొగొట్టుకుని రోడ్డున పడ్డవారు మరికొందరు. ఈ సారి గోదావరి జిల్లాల్లో పందాల్లో దాదాపు 50 కోట్ల మేర చేతులు మారుతాయని అంచనా.

    ఈ సారి పందాలకు అనుమతి లభించడంతో సీనీ నటులు ఆహుతి ప్రసాద్, చిన్నా, నిర్మాతలు కె.ఎస్. రామారావు, సి. కళ్యాణ్ తదితరులు పశ్చిమగోదావరి జిల్లా శ్రీరామ పురంలో జరిగే పందాలను స్వయంగా వీక్షించారు. ఈ సందర్భంగా నిర్మాత కె.ఎస్. రామారావు మాట్లాడుతూ...మా తాతల కాలం నుంచి కోడి పందాలు జరుగుతున్నాయని, ఇన్నాళ్లు ప్రభుత్వం ఆంక్షలు విధించడం వల్ల పందాల్లో పాల్లొనలేక పోయామని, ఇన్నాళ్లకు మళ్లీ ఆంక్షలు సడలించి సంప్రదాయ కోడి పందాలకు అనుమతి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఆహుతి ప్రసాద్ మాట్లాడుతూ...ఫస్ట్ టైమ్ పందాలు చూడటానికి వచ్చానని, పందాలు ఎంతో సరదాగా జరుగుతున్నాయని, చాలా బాగుందని అన్నారు. ఇలాంటి ఉంటేనే పండగ మూడ్ వస్తుందని వ్యాఖ్యానించారు.

    English summary
    Cine Celebrities Ahuthi Prasad, KS Rama Rao, C Kalyan Participated in the cock competitions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X