దావూద్ ఇబ్రహీం సోదరి సినిమా... బాలీవుడ్లో సంచలనం!
‘హసీనా పార్కర్’ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రం దావూద్ సిస్టర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ త్వరలో 'హసీనా పార్కర్' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ముంబై మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా సెప్టెంబర్ 22న విడుదలకు సిద్ధమవుతోంది. తన కెరీర్లో అత్యంత ఎక్కువ ఛాలెజింగ్‌గా చేసిన సినిమా ఇదే అని... ఇతర సినిమాలు చేయడం వేరు, ఈ సినిమా చేయడం వేరు, ఈ సినిమా ద్వారా నటిగా తాను ఎంతో ఇంప్రూవ్ అయ్యాను అంటోంది శ్రద్ధా.

రియల్ లైఫ్‌లో కూడా
ఈ చిత్రంలో దావూద్ ఇబ్రహీం పాత్రలో సిద్ధాంత్ కపూర్ నటిస్తున్నాడు. నిజ జీవితంలో బ్రదర్, సిస్టర్ రిలేషన్ ఉన్న శ్రద్ధా, సిద్ధాంత్ .... ‘హసీనా పార్కర్' సినిమాలోనూ అదే రిలేషన్ కలిగిన పాత్రల్లో నటిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఇద్దరూ సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు.

దావూద్ సామ్రాజ్యం వెనక
ఒకప్పుడు ముంబైని గడగడలాండించిన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం వెనక ఉన్న శక్తి.... ఆమె సోదరి హసీనా పార్కర్. దావూద్ మాఫియా డాన్‌గా ఎదగడంలో ఆమె పాత్ర ఎంతో కీలకం. దావూద్ జీవితం కంటే హసీనా పార్కర్ జీవితమే ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు.

బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో
హసీనా పార్కర్ గురించి బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు ఈ సినిమాలో చూపించబోతున్నారు. ముంబై మాఫియా ఎఫెక్టుకు గురైన కుటుంబాలతో పాటు.... ఒకప్పుడు ముంబై మాఫియా గురించి, దావూద్ గురించి సంచలన వార్తలు విన్న ప్రతి ఒక్కరిలోనూ ఈ సినిమా ఆసక్తిని రేపుతోంది.

సెప్టెంబర్ 22
అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నహీద్ ఖాన్ నిర్మిస్తున్నారు. సురేష్ నాయర్ కథ అందించారు. సెప్టెంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











