»   » అటు చిరు అరెస్టు, ఇటు కాపు ఉద్య‌మంపై సినిమా!

అటు చిరు అరెస్టు, ఇటు కాపు ఉద్య‌మంపై సినిమా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ముద్రగడ నాయకత్వంలో కాపు సామాజిక వ‌ర్గం చేపట్టినప ఉద్యమం ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ . కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తిన చిరంజీవిని పోలీసులు రాజమండ్రిలో అరెస్టు చేసారు. కాగా కాపు సామాజిక వ‌ర్గం చేప‌ట్టిన ఉద్య‌మంపై ‘ప్ర‌జా గ‌ర్జ‌న' అనే సినిమా ప్రారంభం అవుతోంది. డైరెక్ట‌ర్ ఏపీ నాయుడు తెర‌కెక్కించ‌నున్న ఈ సినిమాలో ఆది నుంచి కాపులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు ప్ర‌స్తావిస్తూ తాజాగా ఉద్య‌మాన్ని ఎలుగెత్తి చూపుతుంద‌ని చెబుతున్నారు.

Movie on Kapu Movement in AP

స‌మాజంలో ముఫ్పై శాతం ఉన్న కాపుల‌ను ప్ర‌భుత్వాలు క‌నీసంగా గుర్తించ‌కుండా ఆణిచివేత‌కు గురిచేస్తున్న తీరుపై ఉద్య‌మిస్తూ ఈ సినిమా క‌థ సాగుతుంద‌ని డైరెక్ట‌ర్ ఏపీ నాయుడు చెబుతున్నారు. త‌మ‌కు కావాల్సిన హ‌క్కుల కోసం పోరాడ‌టం కూడా హ‌క్కే అనే నినాదంతో ఈ సినిమా ఉంటుంద‌ని తెలిపారు. గ‌తంలో తెలంగాణ ఉద్య‌మం నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాలు ఉద్య‌మానికి మ‌రింతా ఊపిరినిచ్చాయి. అదే విధంగా కాపు సామాజిక వ‌ర్గం చేప‌ట్టిన ఉద్య‌మానికి త‌మ సినిమా మ‌రింతా స‌పోర్ట్‌గా నిలుస్తుంద‌ని తెలిపారు.

ఇప్ప‌టికే ఈ సినిమా కోసం చేసిన జ‌య‌హో ముద్ర‌గ‌డ.. అనే సాంగ్ ముద్ర‌గ‌డ దీక్ష‌లో ఉర్రూత‌లూపుతోంద‌ని చిత్ర‌యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో ఉద్య‌మ నాయ‌కులు కూడా క‌నిపించ‌నున్నార‌ని తెలిపారు. క‌వి క‌ల కంబైన్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కనున్న ఈ సినిమా పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నామ‌ని చిత్ర‌యూనిట్ తెలిపింది.

English summary
Movie on Kapu community Movement in AP. The Kapus in Andhra Pradesh are seeking reservation under Backward Class category.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu