సైనా నెహ్వాల్‌పై సినిమా, దీపికను ప్రిఫర్ చేస్తున్న సైనా
సైనా ఇటీవల ఈ విషయమై మాట్లాడుతూ...'కొందరు తనపై సినిమా తీస్తానని వచ్చిన మాట వాస్తవమే. అయితే నేను బిజీగా ఉండం వల్ల కొంత సమయం కావాలని అడిగాను. ఆటగాళ్లపై సినిమా తీయడం అనేది ఒక మంచి ఆలోచన. ఇలాంటి సినిమాలు బ్యాట్మింటన్ కు మరింత ప్రచారాన్ని తెచ్చి పెడతాయి' అని సైనా చెప్పుకొచ్చింది.
అయితే సినిమాలో తాను నటించడం లేదని, అయితే నాలాంటి పాత్ర సినిమాలో ఉంటుందని ఆమె చెప్పకొచ్చింది. నా ఉద్దేశ్యం ప్రకారం ప్రియాంక చోప్రా, దీపిక పడుకొనె లాంటి వాళ్లు అయితేనే బెటర్. దీపిక పడుకొనెకు ఆల్రెడీ బ్యాట్మింటన్ ఆడిన అనుభవం ఉంది కాబట్టి ఆమె పర్ ఫెక్ట్ గా సరిపోతుందని సైనా అభిప్రాయం పడింది.
ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఓ బాలీవుడ్ దర్శకుడు ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్యాట్మింటన్ ఆటతో పాటు కమర్షియల్ అంశాలు జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారా? లేక కేవలం సైనా నెహ్వాల్ ఇన్స్ఫిరేషన్ ఆ జీవితంలోని కొన్ని సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications












