షైనీ రేప్ ఉదంతంపై సినిమా
బాలీవుడ్ వర్ధమాన హీరో షైనీ ఆహుజా పనిమనిషిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణల ఉదంతంపై ఒక సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రాన్ని కె ఎ జోహార్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖుల జీవితాల్లోని సంఘటనలపై ఈ సినిమా ప్లాన్ చేసుకున్నారు. ఇందులో షైనీ ఆహుజా అత్యాచార ఉదంతం కూడా వచ్చి చేరింది. తమ సినిమాలొ ఆహుజా ఉదంతం అనుకోకుండా వచ్చి కలిసిందని జోహార్ చెప్పారు. "చమక్ ది షైనింగ్" పేరుతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో హిటెన్ రాగోర్, దివ్య త్రివేది తదితరులు నటించారు. పంజాబ్ నుంచి వచ్చిన ఒక పల్లెటూరి యువకుడు సినిమాల్లో పాత్రల కోసం ఎంత కష్టపడతాడో, పెద్ద హీరో అయిన తర్వాత ఎలా అహంభావంతో వ్యవహరిస్తారో అన్నది ఈ చిత్రం కథాంశమని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications











