ఐదు భాషల్లో షిరిడీ సాయి చిత్రం
షిరిడీ సాయిబాబా మీద మరో సినిమా త్వరలో రానుంది. షిరిడీసాయి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టాకీపార్టు పూర్తయింది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో సాయిబాబాగా సురభి లీలాపాపారావు నటిస్తున్నారు. మరో ముఖ్యమైన పాత్రలో సుమన్ కన్పిస్తారు. ఈ సినిమాలో మొత్తం పది పాటలు ఉండగా ఏడు పాటల రికార్డింగ్ పూర్తయింది. ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్టు నిర్మాత జి.లలిత చెప్పారు. సురేష్ బిపిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్‌లో ఆడియోను, అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఇంకా లలిత, జి సురేష్ సురభి బాలు, రావికొండలరావు, సుత్తివేలు, జయలలిత, అనంత్, గౌతంరాజు, రాగిణి, బెంగుళూరు పద్మ తదితరులు నటిస్తున్నారు. త్వరలో పాటల చిత్రీకరణ జరుగనుంది.


Click it and Unblock the Notifications