ఈ సారి విద్యా బాలన్ జీవితమే కథాంశం

ఇప్పుడామె జీవిత చరిత్రను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అయితే విద్యా మాత్రం ఈ విషయంలో ఏమీ ఎరుగనట్లు, అలాంటిదేమీ లేనట్లు సమాధానం ఇస్తోంది. అయితే సీనీ వర్గాల్లో మాత్రం...కావాలనే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారని చర్చించుకుంటున్నారు. సాధారణ హీరోయిన్ గా ఉన్న విద్యా ఈ స్థాయికి ఎలా చేరుకుంది. డర్జీ సబ్జెక్టును ఎంచుకుని సాహసోపేతంగా సినిమాలో అందాలు ఆరబొస్తూ, నసీరుద్దీన్ షా లాంటి ముసలి నటులతో నటించడానికి ఎలా అంగీకరించింది? ఈ సినిమా చేయడానికి ఆమెను ప్రభావితం చేసిన అంశాలు ఏమిటి? అనే సబ్జెక్టుతో ఈ సినిమా తెరకెక్కుతోందట. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో త్వరలోనే తేలనుంది.


Click it and Unblock the Notifications











