»   » దోపిడీ నుండి కాపాడండి: చిన్న నిర్మాతల ధర్నా(ఫోటోలు)

దోపిడీ నుండి కాపాడండి: చిన్న నిర్మాతల ధర్నా(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న సినిమా నిర్మాతలు రిలీజ్ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. థియేటర్స్ దొరకక కొన్నిసార్లు, క్యూబ్, యుఎఫ్ఓ సిస్టమ్ రేట్లు భరించలేక మరికొన్నిసార్లు నష్టపోవాల్సి వస్తోంది.

ఈ సమస్య నుండి రక్షించాలని, దోపిడీ నుండి కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆర్.కె. గౌడ్‌ చేస్తున్న దరన్నాకు పలువురు చిన్న నిర్మాతలు సంఘీభావం ప్రకటించారు. శనివారం ఫిలింఛాంబర్ దగ్గర నిర్మాతలు అందరూ సమావేశం అయ్యారు. వారి సమస్యలు పరిస్కారం కావడానికి ధర్నా మొదలు పెట్టారు.

ఈ సందర్బంగా నిర్మాతలు వారి డిమాండ్స్ తెలియజేయడం జరిగింది. రెండు తెలుగురాష్ట్రాల్లో చాలా థియేటర్స్, మరియు క్యూబ్ మరియు యూఎఫ్ఓ సిస్టమ్స్ కొందరి సినిమా పరిశ్రమ పెద్దల చేతుల్లో ఉన్నాయి. అలా ఉండటం వల్ల చిన్న నిర్మాత లకు థియేటర్స్ దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.

థియేట్స్ దొరికినా క్యూబ్, యూఎఫ్ఓ పేరిట ఒక్క వారానికి రూ. 10,800 నుండి రూ. 12,000 వసూలు చేస్తున్నారు. అదే పక్క రాష్ట్రాల్లో ఒక్క వారానికి రూ. 2.300ల నుండి 2,500 వసూలు చేస్తున్నారు. మన దగ్గర ఎక్కువ వసూలు చేస్తూ నిర్మాతలను అన్యాయం చేస్తున్నారన్నారు.

ఉదాహరణకి

ఉదాహరణకి

సత్యం థియేటర్ లో సినిమా రిలీజ్ చేస్తే ఒక్క వారానికి క్యూబ్/యూఎఫ్ఓ నిర్వాహకులు నిర్మాత నుండి రెండు లక్షల యాబై వేలు తీసుకుంటున్నారు. అసలు తీసుకోవాల్సింది లక్షా ముప్పై వేలు మరి ఇంకో లక్ష ఇరవై వేలు ఎందుకు వసూలు చేస్తున్నారు అని ప్రశ్నించారు.

నిర్మాత పరిస్థితి ఏంటి?

నిర్మాత పరిస్థితి ఏంటి?

ఇలా చేస్కుంటూపోతే నిర్మాత పరిస్థితి ఏమిటి? మావద్ద డబ్బులు ఎక్కువగా గుంజుతూ వాళ్లు కోట్లు గడిస్తున్నారు. దానికి ప్రభుత్వానికి టాక్స్ కూడా చెల్లించకుండా మోసం చేస్తున్నారు. అంత బ్లాక్ మయం చేస్తున్నారని ఆరోపించారు.

ఆ పెద్దలే, మాఫియా

ఆ పెద్దలే, మాఫియా

ఇదంతా కొంత మంది సినీ పెద్దల కనుసన్నల్లో జరుగుతుంది. ఒక మాఫియా లాగా తయారయ్యి కలిసికట్టుగా దోపిడీ చేస్తున్నారు. సినిమా పరిశ్రమను దోపిడీ చేస్తున్నారు. నిర్మాతలను నిట్టనిలువు దోపిడి చేస్తున్నారు. ఇకనైనా ఈ దోపిడీ వ్యవస్థ నుండి పరిశ్రమను కాపాడాలి అన్నారు.

పర్సంటేజీ పద్దతే బెటర్

పర్సంటేజీ పద్దతే బెటర్

థియేటర్స్ లీస్ పద్దతి కాకుండా పర్శంటేజ్ పద్దతిలో నడవాలి అప్పుడే నిర్మాత బతికి బయటపడతాడు. మా గోడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చేరేవరకు, మా సమస్యలు తీరే వరకు ఆందోళన చేస్తామని ప్రకటించారు.

English summary
Tollywood Movie producers staged Dharna at Film Chamber.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu