Cinema Buzz: ఈ వీకెండ్ విడుదలయ్యే సినిమాలివే..
హైదరాబాద్: వీకెండ్ వచ్చిదంటే చాలు ఏదో ఒక సినిమా విడుదలకు సిద్దంగా ఉంటుంది. వారాంతం కావడంతో ఓపెనింగ్స్ బాగా వస్తాయనే ఉద్దేశ్యంతో చాలా మంది నిర్మాతలు వీకెండ్లో సినిమాను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ వారం కూడా పలు సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. అందులో విశాల్-త్రిష జంటగా రూపొందిన 'వేటాడు-వెంటాడు', కమల్ హాసన్ విశ్వరూపం, శ్రీకాంత్ 'శత్రువు' చిత్రాలు ఉన్నాయి.
1. వెంటాడు-వేటాడు విశాల్ హీరోగా 5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై నిర్మాత శ్రీనివాస్ దామెర అందిస్తున్న ద్విభాషా చిత్రం 'వేటాడు - వెంటాడు'. త్రిష కథానాయికగా నటిస్తోంది. జనవరి 24న చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ మూవీగా తెక్కించారు.
2. కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వరూపం చిత్రాన్ని చంద్రహాసన్, కమల్ హాసన్ సంయుక్తంగా నిర్మించారు. హీరోయిన్లుగా పూజా కుమార్, ఆండ్రియా నటిస్తుండగా, రాహుల్ బోస్, జైదీప్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 95 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈనెల 25న సినిమా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసారు.
3. శ్రీకాంత్-అక్ష జంటగా వి.యస్.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో వి.యస్.రామిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'శత్రువు'. ఈచిత్రం ఈ నెల 24న ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. రెహమాన్, గిరిబాబు, బ్రహ్మ్రానందం, రఘుబాబు, చైతన్య మంత, వేణుమాధవ్, జాకీ, ప్రభాకర్, దువ్వాసి మోహన్ తదితరులు ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సినిమాటోగ్రఫి: రాహుల్, సంగీతం: గణ, ఎడిటర్: వి.నాగిరెడ్డి, ఆర్ట్: వి.ఎన్.సాయిమణి, సాహిత్యం: చంద్రబోస్, సాహితి, కొరియోగ్రఫి: స్వర్ణ, ప్రొడక్షన్ కంట్రోలర్: వెంకట్ వుయ్యూరు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: పి.వి.శాస్త్రి, నిర్మాణ నిర్వహణ: గుర్రం శ్రీనివాసరెడ్డి, నిర్మాత: వి.యస్.రామిరెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్.


Click it and Unblock the Notifications











