నేను మీకు తెలుసా

By Staff

Nenu Meeku Telusa
గజనీ,సత్యభామ చిత్రాల వరసలో వచ్చిన మరో మతిమరుపు సినిమా నేను మీకు తెలుసా. అయితే క్లీన్ స్లేట్ అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా వచ్చిన ఈ చిత్రం పబ్లిసిటీతో ఊదరకొట్టినంతగా విషయం లేదని అనిపిస్తుంది. అయితే మంచు మనోజ్ కష్టం మాత్రం అడుగడుగునా సినిమాలో కనిపిస్తుంది. కానీ మరీ ఎక్కువగా గ్రాఫిక్స్ వాడటం,స్క్రీన్ ప్లే లో సెకెండాఫ్ లో గ్రిప్ తగ్గి బోర్ రావటం,కామిడీ అతి తక్కువగా ఉండటం,ఫ్యామిలీలకు నచ్చే ఎలిమెంట్స్ లేకపోవటం మైనస్ లుగా మిగిలాయి. అయితే యూత్ కి పడితే కొంతవరకూ వర్కవుట్ అయ్యే అవకాశం ఉంది.

ఆదిత్య(మనోజ్) ఓ పెద్ద బిజెనెస్ మేన్ కొడుకు. అయితే తండ్రిని కోల్పోయిన అతను ఓ కార్ ఏక్సిడెంట్ లో మెమరీనీ కోల్పోతాడు. అప్పటినుంచీ అతను ఉదయం లేవగానే గతం రోజు ఏం జరిగిందో పూర్తిగా మర్చిపోతూంటాడు. డాక్టర్ (హర్షవర్ధన్) సూచన మేరకు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలన్నీతన వాయిస్ లోనే ఓ టేప్ రికార్డరర్ (ఎమ్.పి.త్రి రోజుల్లో) రికార్డు చేసుంకుని జీవిస్తూంటాడు. ఆ క్రమంలోనే మధుమిత(రియాసేన్ )తో పరిచయమవుతుంది. అయితే అతని అంకుల్,కంపెనీ ఎండి(నాజర్)కీ,డాక్టర్ కీ తప్ప వేరెవరీకీ ఈ రహస్యం తెలియనీయకుండా కాపాడుకుంటూ వస్తూంటాడు. అలాగే డాక్టర్ ఈ క్యాసెట్స్ అన్నీ లైఫ్ హిస్టరీ పేరిట దాస్తూంటాడు. ఈలోగా అతని అంకుల్ హత్య జరిగిపోతుంది. ఆయన బాడీ ఆది కారులో దొరుకుతుంది. ఆదినే అనుమానితుడుగా పోలీసులు అరెస్టు చేస్తారు. ఆ కేసును పరిష్కరించటానికి అంజలి(స్నేహ ఉల్లాల్) అనే ఐపియస్ ఆఫీసర్ రంగంలోకి దూకుతుంది. అయితే వాళ్ళిద్దరూ కాలేజీమేట్స్ . వాళ్ళద్దరికీ ప్లాష్ బ్యాక్ ఉంటుంది. అప్పట్లో ఆమెపై ఆది కామెంట్ చేయటంతో ఆమె అతని నుండి దూరంగా వచ్చేస్తుంది. మరి ఇప్పుడామె అతని కేసు ఎలా డీల్ చేసింది. ఆదిత్య ఎలా బయిటపడ్డాడు అనేది ధ్రిల్లర్ ఫార్మెట్ లో సాగే కథనం.

ఇక ఈ చిత్రాన్ని మంచు మనోజ్ తన సొంత బిడ్డలా సాకి మొదటనుంచీ హైప్ క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. అలాగే నటనలోనూ మంచి ఈజ్ ని ప్రదర్శించి,డైలాగులు బాగా చెప్పటం జరిగింది. అలాగే స్నేహ ఉల్లాల్ సెక్సీ డాన్స్ తో సినిమాకు ఊపు తెచ్చే ప్రయత్నం చేసింది. అన్నిటికన్నా శ్రీలక్ష్మీ గణపతి ఫిలింస్ అంటూ సూరేఖా వాణి చేసే కామిడి బాగా పండింది. ఇక పాత హిట్ సాంగ్ మబ్బే మసగేసిందిలే సాంగ్ రీమిక్స్ గోప్పగా లేకపోయినా ఓ.కె.ఫస్టాఫ్ స్పీడ్ గా ఎంటర్ టైనింగ్ గా వెళ్ళిపోతే సెకెండాఫ్ కథ లేకపోవటంతో డ్రాగ్ అయింది. అయితే క్లైమాక్స్ కి వచ్చిసరికి దర్శకుడు ఓ లాజికల్ ఎండింగ్ కి తేవటానికి ప్రయత్నించాడు.

1994 లో వచ్చిన క్లీన్ స్లేట్ అనే సినిమా ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో పాయింట్ వినటానికి నావల్టీగా ఉంటుంది. అయితే ప్రెజెంటేషన్ ఏ మాత్రం ప్రక్కకు వెళ్ళినా భరించటం కష్టం. అలాగే ఈ చిత్రానికి స్టోరీ మరింత షార్పుగా తయారు కావల్సి ఉందని పిస్తుంది. అప్పటికీ దర్శకుడు అజయ్ శాస్త్రి స్క్రీన్ ప్లేని కొంతవరకూ సరిగ్గానే వేసుకొచ్చాడు. టేకింగ్ స్టైలిష్ గా చేసారు. విజువల్స్ గ్రాఫిక్స్ డిపార్ట్ మెంట్ వాళ్లు కూడా బాగానే కష్ట పడ్డారు.

ఫైనల్ గా కొంత వరకూ బోరింగ్ గా అనిపించే ఈ సినిమా మౌత్ టాక్ బాగా వస్తేనే వర్కవుట్ అవుతుంది. అయితే ఓ ప్రయోగంలా రొటీన్ కి భిన్నంగా వెళ్ళినందుకు నిర్మాతగా మోహన్ బాబుని అభినందించాలి. సరదాగా ఓ థ్రిల్లర్ సినిమా చూద్దామని ప్రిపేర్ అయి వెళ్ళేవారని నిరాశపరచదు. మిగతావారికి కష్టమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X