For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకే చోట సరదాగా... (ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్: టాలీవుడ్ ని ఏలుతున్న పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకేచోట బిజీగా తమ పనులు తాము చేసుకుంటున్నారు. ఎక్కడా అంటే రామోజీ ఫిల్మ్‌సిటీ. ఆఫిల్మ్ సిటిటిలో టాలీవుడ్‌లో భారీ చిత్రాలు ఒకేసారి రూపుదిద్దుకొంటున్నాయి. ఎక్కడ చూసినా వారి సందడే కనిపిస్తూ కనువిందు చేస్తోంది.

  మండువా ఇంట్లో ఎన్టీఆర్‌, శ్రుతిహాసన్‌ల మధ్య భావోద్వేగమైన సన్నివేశం... ఓ పట్టణంలో రామ్‌చరణ్‌ బస్సు ప్రయాణం... హైవే రోడ్డు మీద త్రిష తన స్నేహితురాళ్లతో సందడి... ఇవన్నీ ఇక్కడే దర్శనమిస్తున్నాయి.

  ముఖ్యంగా ఈ పెద్ద హీరోలంతా వరసగా సినిమాలు ఒప్పుకోవటంతో...బిజీ షెడ్యూల్స్ తో బిజీగా ఉంటున్నారు. ఒక రకంగా వీరు తమ తమ సెట్స్ వద్దనే మిగతా హీరోలను కలవటం,సంభాషించటం వంటివి చేస్తున్నారు.

  పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ దగ్గరలో షూట్ కావటంతో పలకరించుకోవటం..షూటింగ్ విశేషాలు అడిగి తెలుసుకోవటం వంటివి జరుగుతోంది. మరో ప్రక్క ఎన్టీఆర్ సైతం వెళ్లి రామ్ చరణ్ ని కలవటమో..లేక రామ్ చరణ్..ఎన్టీఆర్ ని కలవటమో చేస్తున్నారు. గబ్బర్ సింగ్ డైరక్టర్ హరీష్ శంకర్ సైతం వెళ్లి తన హీరో పవన్ ని కలిసి ముచ్చట్లు పెట్టి వస్తున్నారు. ఇలా సరదా సరదాగా సాగుతోంది.

  షూటింగ్ ప్లేస్ లు, విశేషాలు....స్లైడ్ షో లో...

  త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం విషయానికి వస్తే...పెద్ద( ఫ్లెక్స్‌హౌస్‌) భవంతిలో పవన్‌కల్యాణ్‌, సమంతల డాన్స్ చేస్తున్నారు. హీరో,హీరోయిన్స్ తోపాటు బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు పాల్గొనగా పాటకి సంబంధించిన చిత్రీకరణ చేస్తున్నారు. దాంతోపాటు కొన్ని సన్నివేశాల్నీ అక్కడే తెరకెక్కిస్తారు. ఈ నెల 15 వరకూ ఫిల్మ్‌సిటీలోనే ఈ సినిమా చిత్రీకరణ ఉంటుంది. శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై.లి. సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత.

  ఎన్టీఆర్ చిత్రం విషయానికి వస్తే... రామోజీ ఫిల్మ్‌సిటీలోని మండువా ఇంటి సెట్ లో ... 'రామయ్యా వస్తావయ్యా' సినిమా కోసం ఎన్టీఆర్‌, శ్రుతిహాసన్‌లపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు... ఇందులో సమంత హీరోయిన్. ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. హరీష్‌ శంకర్‌ దర్శకుడు. హీరో,హీరోయిన్స్ తోపాటు ప్రధాన తారాగణమంతా ఈ షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ నెల 18 వరకూ అక్కడే వివిధ లొకేషన్లలో చిత్రీకరణ సాగుతుందని చిత్ర వర్గాలు తెలిపాయి.

  రామ్‌చరణ్‌ హీరోగా దిల్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం 'ఎవడు'. ఇందులో అల్లు అర్జున్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ చిత్రంలో కాజల్‌, ఎమీ జాక్సన్‌లు కూడా తళుక్కున మెరుస్తారు. ఈ సినిమాకు సంబంధించిన ముఖ్య సన్నివేశాలను రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మాల్‌టౌన్‌ స్క్వేర్‌ ప్రాంతంలో తెరకెక్కిస్తున్నారు. హీరో,హీరోయిన్స్ పై బస్సు ప్రయాణానికి సంబంధించిన ఘట్టం చిత్రీకరిస్తున్నారు. ''మాస్‌ అంశాలు ముడిపడ్డ కథ ఇది. కథ, కథనాల ఎత్తుగడ ఆసక్తికరంగా, నవ్యరీతిలో ఉంటుంద''ని చరణ్‌ చెప్పారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

  హెచ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ త్రిష, ఓవియా, పూనమ్‌ బజ్వా హీరోయిన్స్ గా ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. పీవీఆర్‌ రాజు నిర్మాత. పాండ్యన్‌ దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఫిల్మ్‌సిటీలోని హైవే రోడ్డు మీద సాగుతోంది. ముగ్గురు స్నేహితురాళ్ల జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల చుట్టూ తిరిగే కథ ఇది. ముగ్గురు హీరోయిన్స్ పై అక్కడ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

  రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ సంస్థ మంచు మనోజ్‌ హీరోగా నిర్మిస్తున్న చిత్రం 'పోటుగాడు'. ఇందులో నలుగురు హీరోయిన్స్ ఉంటారు. ఈ చిత్రం మూలం కన్నడ గోవిందాయనమహ చిత్రం డైరక్టర్ ..పవన్‌ దర్శకుడు. శిరీష శ్రీధర్‌ నిర్మాత. హీరో,హీరోయిన్స్ పై క్లైమాక్స్ సన్నివేశాల్ని ఫిల్మ్‌సిటీలోనే తెరకెక్కిస్తున్నారు.

  English summary
  Pawan Kalyan is currently acting in the direction of Trivikram Srinivas. Samantha and Praneetha are the female leads in this film.BVSN Prasad is producing this movie under Sri Venkateswara Cine Chitra India Pvt. Ltd banner. The shooting of the film will be done from today at Ramoji Film City.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X