నిర్భయ కేసులో ఉరిశిక్షపై...సినీతారల స్పందన
న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచారం కేసులోని నలుగురు ప్రధాన నిందితులకు కోర్టు ఉరి శిక్ష విధించింది. ఈ తీర్పుపై పలువురు సినీ తారలు స్పందించారు. తమ ట్విట్టర్ అకౌండ్ ద్వారా ఊరిశిక్షన్ సమర్థిస్తూ స్పందించారు. వారికి ఉరిశిక్ష సరైన శిక్ష అని, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
డిసెంబర్ 16వ తేదిన ఢిల్లీలో నిర్భయపై దోషులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం ఆమెనుదారుణంగా హింసించారు. అనంతరం ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. నిర్భయ సామూహిక అత్యాచారం అంశం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అందరు తీవ్రంగా ఖండించారు. వారిని ఉరితీయాలని డిమాండ్లు వినిపించాయి.
ఈ కేసులో ఆరుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ ఈ ఏడాది మార్చి 11న తీహార్ జైలుల ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ కోర్టు అతనికి మూడేళ్ల శిక్ష విధించింది. మిగిలిన నలుగురిని సాకేత్ కోర్టు నాలుగు రోజుల క్రితం దోషులుగా నిర్ధారించింది. ఈ రోజు ఉరి శిక్ష తీర్పు ఇచ్చింది. ఈ కేసు విచారణ తొమ్మిది నెలలు సాగింది.
1. బిపాసా బసు, బాలీవుడ్ నటి
2. పూనమ్ పాండే, మెడల్, బాలీవుడ్ నటి
3. ఆయేషా టకియా, బాలీవుడ్ నటి
4. అనుపమ్ ఖేర్, బాలీవుడ్ నటుడు
5. కరణ్ జోహార్, బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత
6. రితేష్ దేశ్ ముఖ్, బాలీవుడ్ నటుడు
7. గౌహర్ ఖాన్, బాలీవుడ్ నటి
8. వరుణ్ ధావన్, బాలీవుడ్ నటుడు
9. ఎస్సాన్, సంగీత దర్శకుడు


Click it and Unblock the Notifications











