పాకిస్థాన్ భరతం పట్టండి... టీమిండియాకు మద్దతుగా సినీ స్టార్స్, సెట్స్‌లో బన్నీ ఇలా!

ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ వేళ టీమిండియాకు మద్దతుగా సినీతారాలోకం కదిలింది. కొందరు స్వయంగా ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ వెళ్లి గో ఇండియా గో అంటూ సందడి చేయగా... ఆ అవకాశం లేని వారు సోషల్ మీడియా ద్వారా మన జట్టును ఉత్తేజ పరుస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

ఈ సీజన్లో వరల్డ్ కప్ టోర్నమెంట్ మొదలైన తర్వాత ఎక్కువ మంది సినీ తారలు సోషల్ మీడియా ద్వారా స్పందించడం ఇదే తొలిసారి. టీమిండియా వరల్డ్ కప్ గెలవడం కంటే పాకిస్థాన్ మీద మ్యాచ్ గెలవడాన్నే ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.

స్టేడియంలో సందడి చేసిన రణవీర్ సింగ్

స్టేడియంలో సందడి చేసిన రణవీర్ సింగ్

భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌ ప్రారంభం అవ్వడానికి ముందు మాంఛెస్ట‌ర్ ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో బాలీవుడ్ నటుడు రణవీర్ సందడి చేశారు. టీమిండియా మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో క‌లిసి గ్రౌండ్‌లో సెల్పీలు దిగుతూ హల్ చల్ చేశాడు. రణవీర్ సింగ్ ప్రస్తుతం టీమిండియా తొలిసారి సాధించిన 1983 వరల్డ్ కప్ రూపొందుతున్న చిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

కొడుకుతో కలిసి షారుక్ ఖాన్

ఫాదర్స్ డే సందర్భంగా తన కొడుకు ఆర్యన్ ఖాన్‌తో కలిసి ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నట్లు షారుక్ వెల్లడించారు. ‘గో ఇండియా గో' అంటూ జట్టును ఎంకరేజ్ చేస్తూ ట్వీట్ష్ చేశారు. షారుక్ చేసిన ఈట్వీట్ మీద అభిమానులు వేలాదిగా స్పందించారు.

వీడియో షేర్ చేసిన అనుపమ్ ఖేర్

టీమిండియాను విష్ చేస్తూ ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.... ఓ వీడియో షేర్ చేశారు. పాకిస్థాన్-భారత్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో, ఇంది మనకు ఎంత ప్రతిష్టాత్మకమో ఈ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి ఇండియన్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

సైఫ్, శిబానీ దండేకర్

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పరుగుల వరద పారిస్తుంటే.... బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్, శిబానీ దండేకర్ తదితరులు కేరింతలు కొడుతు మ్యాచ్ ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను శిబానీ దండేకర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.

సెట్స్‌లో బన్నీ

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ షూటింగులో బిజీగా గడుపుతున్నారు. షూటింగ్ గ్యాపులో మొబైల్‌లో మ్యాచ్ వీక్షిస్తున్నారు. దీన్ని తన సెల్ ఫోన్లో చిత్రీకరించిన పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X