బాల్యంపై ఒకమంచి సినిమా
తెలుగులోప్రయోజనాత్మక చిత్రాలు బాగా ఆడవన్నఅపోహ ఉంది. ఎన్‌ఎఫ్‌డిసి, ఎస్‌ఎఫ్ డిసి ఆర్ధికసహాయంతో అప్పుడప్పుడు కొన్ని మంచి సినిమాలు వచ్చిపోతున్నాయి. అదే కోవలోఒత్తిడికి గురవుతున్న బాల్యంపై ఒక బాలల చిత్రం త్వరలో విడుదల కానుంది.బండెడు పుస్తకాల మోత, బడిలోనూఇంట్లోనూ పుస్తకాలతో కుస్తీ పడుతూహాయిగా ఆడుకోడానికి నోచుకోని చిన్నారులజీవితాలను ఈ చిత్రంలో హృద్యంగా చిత్రీకరించారు. ఈ చిత్రానికి శ్వేతసెవెన్త్ ఎ అని పేరు పెట్టారు. శ్రీ హనుమాన్‌క్రియేషన్స్ బ్యానర్‌పైఎ.సీతారామారావు నిర్మించారు. రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్ధ ఈసినిమాకుసబ్సిడీగా కొంత మొత్తం ఇచ్చింది. దర్శకుడు ఎన్‌ఎన్‌శ్రీనివాస్.


Click it and Unblock the Notifications