సినిమాలు-వివాదాలు (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: ప్రజల్లోకి శర వేగంగా దూసుకెల్లే మాధ్యమం సినిమా. సినిమా అనేది కేవలం వినోదం పంచడానికి ఉన్నది అనుకుంటే పొరపాటే. సినిమా మాద్యమాన్ని ఉపయోగించి ఏ విషయాన్నయినా ప్రజల్లోకి సులభంగా తీసుకుపోవచ్చు. అలాంటి సినిమాలు అందరినీ మెప్పించే విధంగా ఉంటే ఫర్వాలేదు. కానీ ఈ మధ్య వస్తున్న కొన్ని చిత్రాలు కొందరిని నొప్పిస్తున్నాయి. ఫలితంగా ఆయా చిత్రాలపై ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మధ్య తరచూ ఇలాంటి సినిమాలు వచ్చి గొడవలకు కారణం అవుతున్నాయి. ఇలా ఆందోళనలకు కారణమైన సినిమాలపై ఓ లుక్కేద్దాం.

కెమెరామెన్ గంగతో రాంబాబు
పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు'. తమన్నా హీరోయిన్, ప్రకాష్ రాజ్ విలన్. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అయిన హీరోకి.... రాజకీయ నాయుడు అయిన విలన్ మధ్య వార్ ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈచిత్రంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ను, తెలంగాణ ఉద్యమాన్ని కించ పరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని ఆందోళన కార్యక్రమాలు జరిగాయి.

సారీ టీచర్
మహిళా టీచర్ల హుందాతనాన్ని దెబ్బతీసేదిగా, యువతను పక్కదారి పట్టించేదిగా ఉందనే ఆరోపణలు ఎదుర్కొన్న ‘సారీ టీచర్'. ఆర్యమన్, కావ్యాసింగ్ హీరో హీరోయిన్లుగా సూర్యలోక్ ఫిలిమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ఆనంద్ ఈచిత్రాన్ని నిర్మించారు. శ్రీసత్య దర్శకుడు. ఈ చిత్రం వివాదం కోర్టుల వరకు వెళ్లింది.

ఎ ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం
చలం 1937లో రాసిన 'బ్రాహ్మణీకం' నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించిన చిత్రం బ్రాహ్మణిజం. చలం వంటి గొప్ప వ్యక్తి రాసిన పుస్తకం పేరును అడ్డుపెట్టుకుని, బ్రాహ్మణ స్త్రీలను కించపరిచేలా సినిమాలు తీయడం పట్ల బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో చివరకు ప్రభుత్వం ఈ చిత్రాన్ని నిలిపి వేసింది.

జైబోలో తెలంగాణ
తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న నేపథ్యంలో ఎన్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జైబోలో తెలంగాణ'. ఈచిత్రంలో తెలంగాణ ఉద్యమాన్ని ఫోకస్ చేయడంతో పాటు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ, సీమాంధ్రులు అన్నదమ్ముల్లా కలిసుందా అనే మెసేజ్ ఇచ్చారు. అయితే ఈచిత్రంపై సీమాంధ్రలో ఆందోళనలు చెలరేగాయి. అక్కడ ఈచిత్రాన్ని నిలిపివేసారు.


Click it and Unblock the Notifications











