Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
చిత్రాన్ని నిషేధించాల్సిందే :ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్

సమాఖ్య అధ్యక్షులు రహీముద్దీన్ అన్సారీ మాట్లాడుతూ ముస్లిం సమాజం యావత్తు కలసి ఉండి కుట్రలపై పోరాటం చేయాలని పిలుపు ఇచ్చారు. నాయకులు లాల్‌జాన్‌బాషా, షబ్బీర్ అలీ, రెహమాన్, మహమూద్ అలీలు పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి చిత్రాలకు అనుమతివ్వొద్దని డిమాండు చేశారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ముస్లిం సమాజం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముస్లిం మత పెద్దలు మౌలానా ముఫ్తీ జలీల్ అహ్మద్, మౌలానా ఖాజా సయ్యద్ ఆజం, మౌలానా సయ్యద్ మ్మిద్ కబూల్, అబ్దుల్ ఖయ్యూం, జాఫర్ పాషా, తదితరులు పాల్గొన్నారు. వేల సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.
ముస్లిం మతం ఓ క్యాన్సర్ అనీ, తాజాగా తాను తీసిన 'ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిం' చిత్రంలోనూ దాన్నే చూపించానంటూ దర్శకుడు తనను తాను సమర్థించుకున్నారు. అరబ్ దేశాల ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా తీసిన అమెరికా సినిమాతో ఈజిప్టులో చెలరేగిన ఆగ్రహావేశాలు యావత్ ముస్లిం ప్రపంచాన్ని తాకాయి. అమెరికా వాసి ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా తీసిన చిత్రంలో ముస్లింల మత పెద్ద ఓ స్వలింగ సంపర్కకుడంటూ చిత్రంలో చూపించగా ముస్లిం దేశాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా యు.ఎస్ కాన్సులేట్లపై దాడులు కారణమైనలకు ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అమెరికన్ దర్శకుడు శ్యాంబేసిల్ ప్రస్తుతం అజ్ఞాత జీవితాన్ని గడపుతున్నారు. ఈయన తన మనోభావాలను ప్రపంచానికి తెలపాలని ఓ ప్రముఖ వార్తా పత్రికకు సందేశం పంపించాడు. తను ముస్లీం మత పత్రికకు సందేశం పంపిస్తూ. తాను తీసిన చిత్రం అంతం కాదు ఆరంభం మాత్రమేనని, మున్ముందు మరెన్నో ముస్లిం వ్యతిరేక చిత్రాలకు దర్శకత్వం వహించనున్నట్టు ప్రకటించారు.