twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిత్రాన్ని నిషేధించాల్సిందే :ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ డిమాండ్‌

    By Srikanya
    |

    Asaduddin Owaisi
    హైదరాబాద్: ముస్లింల మనోభావాలను దెబ్బ తీసేలా అమెరికాలో చిత్రీకరించిన ఇన్నోవేషన్స్‌ ఆఫ్‌ ముస్లింస్‌ చిత్రాన్ని తక్షణమే నిషేధించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తేవాలని ముస్లిం యునైటెడ్‌ ఫోరమ్‌ డిమాండు చేసింది. ఫోరమ్‌ ఆధ్వర్యంలో దారుస్సలాంలోని ఎంఐఎం కేంద్ర కార్యాలయం ఆవరణలో నిర్వహించిన భారీ బహిరంగ సభ సోమవారం తెల్లవారుజాము 3.30గంటల వరకు కొనసాగింది. హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని పూర్తిగా నిషేధించి, నిర్మాతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. చిత్రం ప్రదర్శించకుండా యూఎన్‌వోపై భారత ప్రభుత్వం ఒత్తిడి చేయాలని కోరారు. ఇలాంటి చిత్రాలు మళ్లీ రాకుండా ప్రత్యేక చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

    సమాఖ్య అధ్యక్షులు రహీముద్దీన్‌ అన్సారీ మాట్లాడుతూ ముస్లిం సమాజం యావత్తు కలసి ఉండి కుట్రలపై పోరాటం చేయాలని పిలుపు ఇచ్చారు. నాయకులు లాల్‌జాన్‌బాషా, షబ్బీర్‌ అలీ, రెహమాన్‌, మహమూద్‌ అలీలు పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి చిత్రాలకు అనుమతివ్వొద్దని డిమాండు చేశారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ముస్లిం సమాజం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముస్లిం మత పెద్దలు మౌలానా ముఫ్తీ జలీల్‌ అహ్మద్‌, మౌలానా ఖాజా సయ్యద్‌ ఆజం, మౌలానా సయ్యద్‌ మ్మిద్‌ కబూల్‌, అబ్దుల్‌ ఖయ్యూం, జాఫర్‌ పాషా, తదితరులు పాల్గొన్నారు. వేల సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.

    ముస్లిం మతం ఓ క్యాన్సర్ అనీ, తాజాగా తాను తీసిన 'ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిం' చిత్రంలోనూ దాన్నే చూపించానంటూ దర్శకుడు తనను తాను సమర్థించుకున్నారు. అరబ్ దేశాల ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా తీసిన అమెరికా సినిమాతో ఈజిప్టులో చెలరేగిన ఆగ్రహావేశాలు యావత్ ముస్లిం ప్రపంచాన్ని తాకాయి. అమెరికా వాసి ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా తీసిన చిత్రంలో ముస్లింల మత పెద్ద ఓ స్వలింగ సంపర్కకుడంటూ చిత్రంలో చూపించగా ముస్లిం దేశాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

    ప్రపంచ వ్యాప్తంగా యు.ఎస్‌ కాన్సులేట్లపై దాడులు కారణమైనలకు ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అమెరికన్‌ దర్శకుడు శ్యాంబేసిల్‌ ప్రస్తుతం అజ్ఞాత జీవితాన్ని గడపుతున్నారు. ఈయన తన మనోభావాలను ప్రపంచానికి తెలపాలని ఓ ప్రముఖ వార్తా పత్రికకు సందేశం పంపించాడు. తను ముస్లీం మత పత్రికకు సందేశం పంపిస్తూ. తాను తీసిన చిత్రం అంతం కాదు ఆరంభం మాత్రమేనని, మున్ముందు మరెన్నో ముస్లిం వ్యతిరేక చిత్రాలకు దర్శకత్వం వహించనున్నట్టు ప్రకటించారు.

    English summary
    A public meeting organised jointly by the Muslim United Front and United Muslim Action Committee strongly condemned the anti-Islam film against the Prophet of Islam. The meeting held at Majlis headquarters at Darussalam grounds was attended by religious scholars of all sects and schools of thought and representatives of various Muslim organisations and political parties. The speakers expressed deep sense of hurt and anger of Muslim community and urged the government of India to convey the feelings to the US government. The meeting further demanded the government to remove the trailer of the anti-Islam film on youtube, Google and other social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X