రాత్రైతే ఫుల్ బాటిల్ తాగి.. మహిళలపై అలా.. బాలకృష్ణపై ఎంపీ గోరంట్ల దారుణ వ్యాఖ్యలు
నట సింహం, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. హిందూపురం అసెంబ్లీ స్థానానికి గెలిపిస్తే మూడు ఘన కార్యాలు వెలగబెట్టారని ఆరోపించారు. ఆయన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూపురంలో నిర్వహించిన సభలో ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రమైన పదజాలంతో తిట్ల పర్వాన్ని కొనసాగించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ తన ప్రసంగంలో..
తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు ఏపీని పరిపాలించింది. ఆ పాలనలో నందమూరి బాలకృష్ణ మూడు ఘన కార్యాలను చేశాడు. హిందూపూర్ నియోజకవర్గానికి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను రెండుసార్లు గెలిపిస్తే.. రాత్రి అయితే ఫుల్ బాటిల్ తాగుతాడు. తెల్లారితే ఓటర్లను తంతాడు అంటూ గోరంట్ల కామెంట్ చేశాడు.

ఇక రెండో ఘనకార్యం విషయానికి వస్తే.. వారికి హిట్ సినిమాను ఇచ్చిన నిర్మాతను ఫట్‌మని తుపాకీ కాల్చి చంపేందుకు ప్రయత్నించాడు. ఇక ఈ రాష్ట్రంలో మహిళలకు జగన్మోహన్ రెడ్డి అండగా నలిచి సంక్షేమానికి పెద్ద పీట వేశాడు. కానీ బాలకృష్ణ మహిళను అవమానించేలా, కించపరిచేలా మాట్లాడుతుంటాడు అని ఎంపీ గోరంట్ల తెలిపారు.
హిళలు పూజింపబడాలి.. గౌరవించబడాలని ఏపీ ప్రభుత్వం భావిస్తే.. బాలకృష్ణ మాత్రం వారిని అవమానిస్తుంటాడు. అమ్మాయి కనపడితే ముద్దైనా పెట్టాలి. లేదా కడుపన్నా చేయాలి అంటూ దుర్గార్గంగా మాట్లాడుతుంటాడు. అలాంటి వ్యక్తికి వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయవద్దు. ముద్దులు పెట్టాలి. కడుపులు చేయాలని ఎమ్మెల్యేను ఓడించాలి అని ఎంపీ గోరంట్ల పిలుపునిచ్చారు.
దూపురం నియోజకవర్గంలో బాలకృష్ణపై ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు, నేతలు గట్టిగానే కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై నందమూరి బాలకృష్ణ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











