నేను చిరంజీవి అభిమానినే, ‘సైరా’ కోసం వెయిట్ చేస్తున్నా: ఎంపీ కవిత
మెగాస్టార్ చిరంజీవికి తాను అభిమానినే అని చెప్పుకొచ్చారు తెలంగాణ ఎంపీ కవిత. సోషల్ మీడియా ద్వారా ప్రజలు అభిమానుల నుంచి ఎదురైన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి మీరు చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' సినిమా కోసం ఎదురు చూస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.
దీనికి ఆమె స్పందిస్తూ.. ' అఫ్ కోర్స్, నేను చిరంజీవి అభిమానినే, ఆయన కొత్త మూవీ ఏది వస్తున్నా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. తప్పకుండా దాని కోసం వెయిట్ చేస్తాను.' అంటూ సమాధానం ఇచ్చారు.
యంగ్ స్టర్స్‌కు ఏదైనా సందేశం ఇవ్వాలని మరో వ్యక్తి కోరగా... 'యువతకు ప్రత్యేకించి అడ్వైజ్ ఇవ్వడం బావుండదు. ఎందుకంటే సలహాలు వినడం వారికి నచ్చదు. పెద్ద చెప్పొచ్చారులే అనుకుంటారు. వారిని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే. చేసే ఏ పనిలో అయినా సిన్సియారిటీ ఉంటే హ్యాపీగా ముందుకు సాగవచ్చన్నారు.

ఇపుడు సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ప్రతి నిమిషం ఒక నోటిఫికేషన్ వస్తుంది. మనం అమ్మతో మాట్లాడుతున్నా.. చదువుకుంటున్నా, దేవుడి పూజలో ఉన్నా నోటిఫికేషన్ డిస్ట్రబ్ చేస్తుంది. టూ మచ్ ఆఫ్ టెక్నీలనీ ఇంటరప్షన్ మంచిది కాదు. టెక్నాలజీ మంచిదే... దానికి నా మద్దతు ఉంటుంది. అయితే దాన్ని ఎంత వరకు అవసరమో అంత వరకే ఉపయోగించుకోవాలని కవిత సూచించారు.
నోటిఫికేషన్లు డిస్ట్రబ్ చేస్తుంటే... వాటిని ఆఫ్ చేయడం, గంటకో రెండు గంటలకో ఫోన్ చూడాలనే రూల్ పెట్టుకోవడం చేస్తే తప్పకుండా మిగతా వాటిపై ఫోకస్ పెట్టడానికి వీలుంటుంది. సెల్ ఫోన్ మనకు మేలు చేసే విధంగా వాడుకోవాలని తెలిపారు.


Click it and Unblock the Notifications











