మామ‌ను మించిన అల్లుడుగా సాయిధ‌ర‌మ్.. పులిలా గంభీరంగా వినాయక్

By Rajababu

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లి. అధినేత సి.కళ్యాణ్‌ నిర్మించిన చిత్రం 'ఇంటిలిజెంట్‌'. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్‌ అవుతుంది. ఈ సంద‌ర్భంగా రాజ‌మండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి, చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా..

Recommended Video

Sai Dharam Tej Next Movie With A Crazy Director
రాజమండ్రిలోనే సక్సెస్ మీట్‌..

రాజమండ్రిలోనే సక్సెస్ మీట్‌..

పార్ల‌మెంట్ స‌భ్యులు ముర‌ళీమోహ‌న్ మాట్లాడుతూ - ``ప్రీ రిలీజ్ వేడుక‌నే కాదు, స‌క్సెస్ మీట్‌ను కూడా రాజమండ్రిలోనే జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్నాను. సాయిధ‌ర‌మ్ తేజ్ డాన్సుల‌ను అద్భుతంగా చేశాడని తెలిసింది అని అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి గుర్తొచ్చారు..

మెగాస్టార్ చిరంజీవి గుర్తొచ్చారు..

35 ఏళ్ల క్రితం నేను, చిరంజీవిగారు క‌లిసి `మ‌న వూరి పాండ‌వులు` సినిమాలో న‌టించాం. ఇప్పుడు సాయిధ‌ర‌మ్‌ను చూస్తుంటే చిరంజీవిగారే గుర్తుకు వ‌స్తున్నారు. మామకు త‌గ్గ అల్లుడుగా సాయిధ‌ర‌మ్ నిరూపించుకుంటున్నాడు. రేపు మామ‌ను మించిన అల్లుడు కావాల‌ని కోరుకుంటున్నాను.

వీవీ వినాయక్‌ అభినందనలు

వీవీ వినాయక్‌ అభినందనలు

ఎన్నో హిట్స్ మీద హిట్స్ తీస్తున్న వినాయ‌క్‌ అభినంద‌న‌లు. చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి ఎదిగిన క‌ల్యాణ్ ఇప్పుడు పెద్ద నిర్మాత‌గా రాణిస్తున్నారు. మ‌రో నాలుగేళ్ల‌లో రామానాయుడుగారిని మించి సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను అని మురళీ మోహన్ తెలిపారు.

ఆ పాట ఫ్యాన్స్‌కు పండుగే

ఆ పాట ఫ్యాన్స్‌కు పండుగే

అనంతరం సీకే ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత సీ క‌ల్యాణ్ మాట్లాడుతూ.. త్రివిక్ర‌మ‌రావుగారి నిర్మాణంలో ఇళ‌య‌రాజాసంగీతంలో సీతారామ‌శాస్త్రి ర‌చించిన చ‌మ‌కు చ‌మ‌కు సాంగ్ ఎంత పెద్ద హిట్టో మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు ఇంటిలిజెంట్ సినిమాలో మేం రీమేక్ చేశాం. ఈ చ‌మ‌కు చ‌మ‌కు సాంగ్ ఫ్యాన్స్‌కు పండ‌గే అవుతుంది.

సాయిధరమ్ మరో మెగాస్టార్

సాయిధరమ్ మరో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, నాగ‌బాబు మావ‌య్యలు కలిసి మ‌రో మెగాస్టార్ కావాల‌నుకున్న‌ది ఈ సుప్రీమ్ స్టార్ సాయిధ‌ర‌మ్‌తేజ్‌. ఇప్ప‌టి వ‌ర‌కు సాయిధ‌ర‌మ్ తేజ్ చేసిన సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. డెఫినెట్‌గా ఈ సినిమా వేరు. మా సోద‌రుడు వినాయ‌క్ సినిమాను ఇర‌గ‌దీయించారు. పాట‌లు చూస్తుంటే చిరంజీవిగారి సాంగ్స్ చూస్తున్న‌ట్లుంటుంది.

దాసరి తర్వాత వీవీ వినాయక్

దాసరి తర్వాత వీవీ వినాయక్

ఓ ద‌ర్శ‌కుడు కారు దిగగానే ..సింహం,పులి, ఎనుగులా గంభీరంగా అనిపించే వారిలో మా గురువుగారు దాస‌రిగారుంటే.. త‌ర్వాత అలా అనిపించే ద‌ర్శ‌కుడు వినాయ‌క్ మాత్ర‌మే. లోప‌ల ఎంత టెన్ష‌న్ ఉన్నా బ‌య‌ట‌కు న‌వ్వుతూ ప‌ల‌క‌రిస్తుంటాడు. మా కాంబినేష‌న్‌లో ఫ్యూచ‌ర్‌లో ఇంకా రిపీట‌వుతుంది. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X