‘RGV వ్యూహం మూవీ మ్యాట్నీ షోలు ఫుల్ అయితే.. మీసాలు తీసేసుకొంటా..!’ వైసీపీ నేత సవాల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం వ్యూహం. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని వ్యూహం, రెండో భాగాన్ని శపథం పేరుతో రిలీజ్ చేయడానికి ప్లాన్ సిద్దం చేశారు. ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్లను కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే ఆర్జీవీ రూపొందిస్తున్న వ్యూహం సినిమాపై ఎంపీ రఘు రామ రాజు (RRR) సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. RRR చేసిన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..
రాంగోపాల్ వర్మ గొప్ప దర్శకుడు. ఆయన రూపొందిస్తున్న వ్యూహం సినిమా నవంబర్ 10వ తేదీన రిలీజ్ అవుతున్నది. రెండో భాగం శపథం సినిమా జనవరి 25వ తేదీన రిలీజ్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు సినిమాలు రెండో వారానికి సినిమా థియేటర్లలో ఉండవు. తెలియని వారికి ఈ ఊహా చిత్రాలు అద్బుతంగా ఉంటాయి. వ్యూహం సినిమా తొలి రోజు మ్యాట్నీ షో ఫుల్ అయితే మీసాలు తీసేసుకొంటాను అని రఘు రామకృష్ణం రాజు సవాల్ విసిరారు.

వైఎస్ మరణం తర్వాత రాష్ట్రంలో జరిగింది విధ్వంసం అయితే.. దానిని అద్బుతంగా జరిగినట్టు సినిమాలో చూపించే ప్రయత్నం జరుగుతున్నది. అయితే ఆ సంఘటనలను ప్రత్యక్ష్యంగా చూసిన వారికి ఆ విధ్వంసం ఏమిటో తెలుసు. ఓ వ్యక్తి ఆత్మకథలాగా పచ్చి అబద్దాలను చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని రఘురామకృష్ణ రాజు అన్నారు.
ఏపీలో ఎన్నో అక్రమాలను అరాచకాలను చేసిన వ్యక్తిని స్వామి వివేకానంద మాదిరిగా, రామకృష్ణ పరమహంస మాదిరిగా చూపిస్తే చూడడానికి ప్రేక్షకులేమీ వెర్రివాళ్ళు కాదు. ఈ సినిమాను తమ పార్టీకి కరుడు గట్టిన కుల, మత కార్యకర్తలతో మార్నింగ్ షోలు ఫుల్ అయినా.. మ్యాట్ని షోకు ప్రేక్షకులే ఉండరు. ఒకవేళ మ్యాట్నీ షో ఫుల్ అయితే నా మీసాలను తొలగించుకొంటాను అని రఘురామకృష్ణ రాజు సవాల్ చేశారు.

ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడానికి వ్యూహం, శపథం సినిమాకు టికెట్లను ఉచితంగా పంచి చూపిస్తారా? లేదా ప్రజలను బెదిరించి థియేటర్ పట్టుకొస్తారా? అనేది చూడాలి. సాక్షి పేపర్‌ను ఉచితంగా ఇంటింటికి ఫ్రీగా పంచుతారేమో అని రఘురామకృష్ణ రాజు సెటైర్ వేశారు.
ఆర్జీవి డెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రామదూత క్రియేషన్స్ అధినేత దాసరి కిరణ్ కుమార్ వ్యూహం సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వైఎస్ జగన్‌గా అజ్మల్ వైఎస్ భారతీ పాత్రలో మానస నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సుజీష్ రాజేంద్రన్, ఎడిటర్‌గా మనీష్ ఠాకూర్ వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











