శ్రీరెడ్డిపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు: బ్లూఫిల్మ్‌లు తీసుకుంటూ ఇలా.. వాటి కోసమే పవన్‌ను అంటూ!

తెలుగు రాష్ట్రాల్లో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ.. చాలా కాలంగా హాట్ టాపిక్ అవుతోంది హాట్ బ్యూటీ శ్రీరెడ్డి. నిత్యం ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తోన్న ఈమె.. సినిమా వాళ్లనే కాకుండా రాజకీయ నాయకులను సైతం విమర్శిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు రాఘురామ కృష్ణం రాజుపై ఒంటి కాలిపై లేచింది. బూతులు తిడుతూ రచ్చ రచ్చ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన శ్రీరెడ్డి వ్యవహారంపై స్పందించారు. ఇందులో భాగంగానే ఆమెను సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసం!

హీరోయిన్‌గా శ్రీరెడ్డి ప్రయాణం ఇలా

హీరోయిన్‌గా శ్రీరెడ్డి ప్రయాణం ఇలా

కెరీర్ ఆరంభంలో ఓ న్యూస్ చానెల్‌లో ప్రజెంటర్‌గా పని చేసింది శ్రీరెడ్డి. అలా కొంత కాలం గడిచిన తర్వాత 'నేను నాన్న అబద్ధం' అనే మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ వెంటనే 'అరవింద్ 2', 'జిందగీ' తదితర సినిమాల్లో లీడ్ రోల్ చేసింది. అయినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు మాత్రం దక్కలేదు. దీంతో సినిమా అవకాశాలు కూడా సన్నగిల్లాయి. తద్వారా పరిశ్రమకు దూరమైంది.

కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో పాపులర్

కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో పాపులర్

సినిమా అవకాశాలు కరువైన సమయంలో శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు కావాలంటే దర్శక నిర్మాతలు చెప్పిన వన్నీ చేయాలని ఆరోపిస్తూ సంచలన ఆరోపణలు చేసింది. అదే సమయంలో హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ ముందు నగ్న నిరసనకు దిగిందీ బ్యూటీ. తద్వారా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది.

ఎప్పుడూ అందులోనే.. టార్గెట్ చేసి

ఎప్పుడూ అందులోనే.. టార్గెట్ చేసి

శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాని ద్వారానే తన అందచందాలతో కవ్వించడంతో పాటు ఎంతో మందిని టార్గెట్ చేస్తూ వస్తోంది. ఇప్పటికే పలువురు సినీ హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకులపై శ్రీరెడ్డి ఎన్నో రకాల విమర్శనాత్మక పోస్టులు పెట్టింది. చాలా మంది బండ బూతులు తిట్టింది. ఫలితంగా విమర్శలు ఎదుర్కొంటోంది.

వైసీపీ ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు

వైసీపీ ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు

ఎప్పుడూ ఎవరో ఒకరిని టార్గెట్ చేసి వీడియోనో, పోస్టులనో చేసే శ్రీరెడ్డి.. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణం రాజుపై విమర్శలు చేసింది. దీనికి కారణం ఆయన కొద్ది రోజులుగా ఆ పార్టీకి చెందిన కొందరిని విమర్శిస్తూ వీడియోలు వదలుతుండడమే. దీనికి స్పందనగా శ్రీరెడ్డి రఘురామపై ఫోకస్ చేసింది. ఇలా వీళ్లిద్దరి మధ్య ఓ వివాదం రాజుకుంది.

శ్రీరెడ్డిపై ఎంపీ సంచలన కామెంట్స్

శ్రీరెడ్డిపై ఎంపీ సంచలన కామెంట్స్

నాలుగు రోజుల క్రితం ఎంపీ రఘురామ కృష్ణం రాజును ఉద్దేశించి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది. 'విగ్గురాజు.. ఏంట్రా రెచ్చిపోతున్నావు? నేను రంగంలోకి దిగానంటే తట్టుకోలేవు. నేను వస్తున్నా ఆగరా నీ పని చెబుతా' అంటూ రాయడానికి వీలులేని బూతులను తిట్టింది. ఈ విషయం ఆయన దృష్టికి చేరవడంతో.. తాజాగా శ్రీరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేస్తో ఓ వీడియోను విడుదల చేశారు.

 బ్లూఫిల్మ్‌లు తీసుకుంటూ ఇలాగ

బ్లూఫిల్మ్‌లు తీసుకుంటూ ఇలాగ

రఘురామ కృష్ణం రాజు ఓ వీడియోను వదిలారు. అందులో 'ఓ కులానికి వత్తాసు పలుకుతూ నన్ను తిడుతోన్న బ్లూఫిల్మ్ నటి.. నీ గురించి ఎవరికి తెలియదు. నువ్వు వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని నన్ను తిట్టడానికి వచ్చావు. ఆ కులం వాళ్లకు నువ్వో శృంగార దేవతలా మారావు. నీ నగ్న నిరసనలు, బూతు పోస్టుల గురించి అందరికీ తెలుసు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
వాటి కోసమే పవన్ కల్యాణ్‌ను అని

వాటి కోసమే పవన్ కల్యాణ్‌ను అని

ఇదే వీడియోలో రఘురామ కృష్ణం రాజు.. పవన్ కల్యాణ్ పేరును కూడా ప్రస్థావించారు. 'ఓ శృంగార దేవత.. బ్లూఫిల్మ్ నటి.. నువ్వు ఓ పార్టీ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని పాపం పవన్ కల్యాణ్ గారిని తిట్టింది నిజం కాదా. రెమ్యూనరేషన్ కోసం ఆయనను ఎన్ని మాటలు అన్నావు. ఆయన మంచోడు కాబట్టి నిన్ను వదిలేశాడు. నీ బెదిరింపులకు భయపడే వాళ్లెవరూ లేరిక్కడ' అంటూ ఘాటుగా స్పందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X