For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చెప్పు తెగేలా తన్నులు తిన్నది నిజం కాదా? ఆ ముగ్గురిని ఛీట్ చేయలేదా? బండ్ల గణేష్‌పై ఎంపీ ఆరోపణలు!

  |

  ఆంధ్ర ప్రదేశ్ అధికార పార్టీకి చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి, తెలుగు సినీనటుడు నిర్మాతగా మారిన బండ్ల గణేష్ మధ్య జరుగుతున్న ట్వీట్ల యుద్ధం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. తొలుత విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి కూడా బండ్ల గణేష్ మీద ఘాటుగానే స్పందిస్తూ పలురకాల ఆరోపణలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

  విజయసాయి రెడ్డి మీద ఆరోపణలు

  విజయసాయి రెడ్డి మీద ఆరోపణలు


  బండ్ల గణేష్ రాజకీయాలకు దూరమై ప్రస్తుతం పూర్తి స్థాయిలో సినిమాల మీద దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆయన కొన్ని సినిమాల్లో నటిస్తూ సినిమా నిర్మాణం మీద దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆయన హీరోగా నటించిన డేగల బాబ్జీ సినిమా షూటింగ్ పూర్తి కాగా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ ఒక సినిమా చేయబోతున్నారు. ఈ మధ్యకాలంలో కొద్దిగా వివాదాల జోలికి పోని బండ్ల గణేష్ అనూహ్యంగా ఎంపీ విజయసాయి రెడ్డి మీద ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

   కులాన్ని టార్గెట్ చేస్తూ

  కులాన్ని టార్గెట్ చేస్తూ


  తొలుత బండ్ల గణేష్ విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ తాను కమ్మ కులానికి చెందిన వ్యక్తి అని ఆయన కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం నచ్చడం లేదని పేర్కొన్నారు. అంతేకాక రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం కూడా విజయసాయి రెడ్డి అని అంటూ మీద పెద్ద ఎత్తున బండ్ల గణేష్ విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్, వైయస్సార్ అంటే తనకు అభిమానమే కానీ వాళ్ల పేర్లు చెడగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నావు అని ఆయన కామెంట్లు చేయడం సంచలనం రేపుతోంది.

  ఆకులు..వక్కలు..పక్కలు


  ఈ విషయం మీద విజయసాయిరెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. ఆకులు..వక్కలు..పక్కలు...ఇదేగా నీ బతుకు! అంతే ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మ సిల్లినా ఓడలు బండ్లవుతాయి గాని, బండ్లు ఓడలు కావు. అయ్యో...గణేశా! అంటూ ఒక ట్వీట్ చేశారు.

   బ్రోకర్లు, తార్పుడు గాళ్లు అంటూ

  బ్రోకర్లు, తార్పుడు గాళ్లు అంటూ

  బ్రోకర్లు, తార్పుడు గాళ్లు, మోసగాళ్లు, జేబులు కొట్టే వాళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తే పెద్దోళ్లు అయిపోతామని భ్రమపడుతుంటారు. బండ్ల లాగా. ఎన్నిసార్లు తన్నులు తిన్నది, ఎవరెవరి కాళ్లుపట్టుకున్నదీ అతని జాతకం లైట్ బోయ్ నుంచి అందరికీ తెలుసని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  మొరిగి గర్జించా అనుకుని


  కుక్కకాటుకు చెప్పుదెబ్బలు తప్పవు. వెన్నుపోటు పేటెంట్ నీ యజమాని చంద్రబాబుది. 28 ఏళ్లుగా చెక్కు చెదరని గిన్నెస్ రికార్డు. ఇంకా వందేళ్లయినా అది బాబు పేరనే ఉంటుంది. ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా బండ్లా? ప్రతి కుక్కా సింహం కావాలనుకుంటుంది. నీలాంటి వాడే భౌ..భౌ మని మొరిగి గర్జించా అనుకుని మురిసిపోతుంటాడు అంటూ వరుస ట్వీట్లతో విమర్శించారు.

   వాళ్లంత మంచోళ్ళు కారు

  వాళ్లంత మంచోళ్ళు కారు


  నీవు మర్చిపోయినట్టు నటిస్తున్నా సచిన్ జోషి మాత్రం నిన్ను జీవితాంతం వెంటాడుతుంటాడు. మూవీకి అతను ఫైనాన్స్ చేస్తే రైట్స్ నువ్వు అమ్ముకున్నావంట. చెప్పు తెగేలా కొట్టింది, ఫోన్ పగిలింది నిజమేనా బండ్లా? రామ్ చరణ్, ఎన్టీఆర్, పూరీలను ఛీట్ చేసినా వదిలేశారు. అందరూ వాళ్లంత మంచోళ్ళు కారు అంటూ ఆయన విమర్శించారు. దానికి బండ్ల మళ్ళీ స్పందించారు.

  English summary
  Mp Vijayasai Reddy strong counter to bandla ganesh through a series of tweets.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X