కాపీ కొట్టాల్సిన అవసరం లేదు...

కథలో రణబీర్ (సైఫ్ అలీ ఖాన్)పేరుకు పెద్ద పారిశ్రమిక వేత్త కానీ ఒంటరి. తనుకు కావలసిన వారినందరినీ కోల్పోతాడు. అనుకోని పరిస్ధితుల్లో కొర్టు తీర్పు ప్రకారం ఓ నలుగురు అనాధల్ని సాకాల్సి వస్తుంది. ఆ పిల్లలకి అతనంటే అసహ్యం. వారు అతనిపై పగ తీర్చుకోవాలని చూస్తూంటారు. అలాంటి సిట్యువేషన్ లో వారంతా భగవంతుడుని ప్రార్ధిస్తారు. అప్పుడాయన తన దగ్గర ఉన్న ఓ అల్లరి దేవ కన్యని వారి దగ్గరికి పంపి సాయం చేసి వారిని కలపమని పని అప్పచెప్పుతాడు. ఆమే రాణి ముఖర్జీ. ఆమే మేఘాలనుండి సైకిలు తొక్కుకుంటూ క్రిందకి వస్తుంది. ఇక అప్పటనుంచి మ్యాజిక్,ఎమోషన్స్,ప్రేమ,ఫన్ అన్నీ స్టార్టవుతాయి. అంటే ప్రేమంటే తెలియని దేవకన్య, ప్రేమ కోల్పోయిన హీరో, ప్రేమ కోసం ఆరాటపడుతున్న నలుగురు పిల్లలు...వీరి మధ్య గేమ్ స్టార్ట్ అవుతుంది.
ఇక కునాల్ కోహ్లి 'మిస్టర్ ఇండియా' సినిమాలోని ఫీల్ చాలా కాలంగా వెంటాడుతోందని అదే తెరపై అనువదించానని చెప్తున్నాడు. అంతే గాక తనకు కాపీ కొట్టాల్సిన అవసరం లేదని ...నిజంగా అంతగా నచ్చితే చెయ్యదలిస్తే రీమేక్ రైట్స్ తీసుకునే చేస్తానంటున్నాడు. కథ కాపీదో కాదో గానీ...బావుంది కదా చూద్దాం .


Click it and Unblock the Notifications











