ఈ కమెడియన్ కొడుకైనా హిట్ అవుతాడా?
ఎందుకనో తెలుగులో కమిడెయిన్ కొడుకులెవరూ హీరోలుగా సక్సెస్ అవలేదు. అయినా తెలుగు తెరపైకి వారి ప్రవాహం మాత్రం ఆగలేదు. తాజాగా సీనియర్ కమెడియన్, కేరక్టర్ ఆర్టిస్ట్, రచయిత అయిన తనికెళ్ల భరణి కుమారుడు తేజ తెరంగ్రేటం చేస్తున్నాడు. అతను హీరోగా పరిచయం కాబోతున్న సినిమా పేరు 'మిస్టర్ లవంగం'. ఆర్.కె.ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై చలపతి మల్లాది దర్శకత్వంలో ఎ.కె.సాయికుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ సినిమా జూలైలోనే విడుదలవుతుందని చెప్తున్నారు. ఇక గతంలో ఎమ్మెస్ నారాయణ కొడుకు విక్రం, బాబూమోహన్ కొడుకు ఉదయ్‌కుమార్, బ్రహ్మానందం తనయుడు గౌతం హీరోగా రాణించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. మరి వీరిని బీట్ అవుట్ చేస్తూ తేజ సక్సెస్ అవుతాడా లేదా అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











