‘మిస్టర్ మజ్ను’ రిలీజ్ డేట్ ఖరారు... కాదనలేక పోయిన అఖిల్!
'హలో' తర్వాత అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న చిత్రం 'మిస్టర్ మజ్ను'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది.
జనవరి 25న తన చిత్రం విడుదల కాబోతోంది అంటూ అఖిల్ ట్వీట్ చేశారు. 'జనవరిలో ఈ సినిమా రిలీజ్ చేయాలని మీరు కోరారు... దాన్ని నేను కాదనలేక పోయాను. నా కెరీర్లో మొదటి జనవరి రిలీజ్ ఇది. కొత్త సంవత్సరాన్ని ఈ సినిమాతో ప్రారంభించబోతున్నందుకు ఆనందంగా ఉంది' అని అఖిల్ వ్యాఖ్యానించారు.
'తొలి ప్రేమ' సినిమాతో విజయం అందుకున్న వెంకీ అట్లూరి రూపొందిస్తున్న యూత్‌ఫుల్ మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అఖిల్ ఈ సినిమాతో కెరీర్ పరంగా మరింత షైన్ అవుతాడనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తం అవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ..ఒక పాట మినహా టోటల్‌గా షూటింగ్ పూర్తయింది. సినిమా రిలీజ్ లోపు ఒక్కో పాటను విడుదల చేస్తాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రిపబ్లిక్ డే కానుకగా ఒకరోజు ముందు జనవరి 25న వరల్డ్‌వైడ్‌గా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామన్నారు.

అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంల: వెంకీ అట్లూరి.


Click it and Unblock the Notifications











