మంచు మనోజ్ కెరీర్లోనే పెద్దది
మంచు మనోజ్ నటిస్తున్న తాజా సినిమా 'మిస్టర్ నోకియా'. మనోజ్ సరసన సనాఖాన్, కృతి కర్బంద హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి అని కన్నెగాని దర్శకత్వం వహిస్తున్నారు. డి.ఎస్ రావు శ్రీశైలేంద్ర సినిమా పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. శివరాత్రిని పురస్కరించుకుని ఫిబ్రవరి 17న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మంచు మనోజ్ సినీ కెరీర్లోనే ఈ సినిమా అతిపెద్ద రిలీజ్‌గా నిలవబోతోంది. 400లకు పైగా థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే 'మిస్టర్ నోకియా' చిత్రం షూటింగ్ పార్టు పూర్తయింది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
మనోజ్, కృతి కర్బంద, సనా ఖాన్, బ్రహ్మానందం, వేణు మాధవ్, అలి, షాయాజీ షిండే, రఘుబాబు, వెన్నెల కిషోర్, పరుచూరి వెంకటేశ్వరరావు, భావన, అల్లరి సుభాషిని నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు : పరుచూరి బ్రదర్స్, సినిమాటోగ్రఫీ బి. రాజశేఖర్, నిర్మాత : డిఎస్ రావు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఆని కన్నెగాని.
మనోజ్ ఈ చిత్రంతో పాటు 'ఊకొడతారా ఉలిక్కి పడతారా' చిత్రంలోనూ నటిస్తున్నారు.ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మంచు లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











