'మిస్టర్ నూకయ్య'రిలీజ్ డేట్ ప్రకటన
మంచు మనోజ్ హీరోగా, కృతి కర్బందా, సనాఖాన్ హీరోయిన్లుగా రూపొందిన 'మిస్టర్ నూకయ్య' చిత్రం ఈ నెల 8న విడుదలవుతోంది. శ్రీ శైలేంద్ర సినిమాస్ పతాకంపై డి.ఎస్. రావు నిర్మించారు. సినిమా 5 సమర్పిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు అని కన్నెగంటి. సినిమా గురించి నిర్మాత రావు మాట్లాడుతూ"ఇది కథని నమ్మి చేసిన సినిమా. చాలా కొత్తగా ఉంటుంది. టైటిల్ పాత్రను మనోజ్ చాలా గొప్పగా చేశారు. ఆయన సమకూర్చిన, చేసిన ఫైట్లు సినిమాకు ఎస్సెట్. తను స్వయంగా రిస్కీ ఫైట్లు, డాన్స్ మూమెంట్స్ చేశారు. ఇందులోని ఎమోషనల్ సీన్లు, ఫైట్లు ఇంతవరకు ఏ తెలుగు సినిమాలో రాలేదు. యువన్‌శంకర్ రాజా గొప్ప మ్యూజిక్ ఇచ్చారు. పాటలకు అనూహ్య ఆదరణ లభించింది. మనోజ్ కెరీర్‌లోనే భారీ స్థాయిలో 400 థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమాతో పెద్ద హిట్ కొడుతున్నామనే నమ్మకం ఉంది'' అని ఆయన చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీభూపాల్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, మనోజ్, లక్ష్మీభూపాల్, ఛాయాగ్రహణం: రాజశేఖర్, కళ: ధర్మేంద్ర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అని కన్నెగంటి.


Click it and Unblock the Notifications











