సెల్ దొంగోడి లవ్ స్టోరి (మిస్టర్ నూకయ్య ప్రివ్యూ)
''నో క్యాప్షన్ - ఓన్లీ యాక్షన్''తో రెడీ అయిన మంచు మనోజ్ తాజా చిత్రం మిస్టర్ నూకయ్య ఈ రోజు విడుదల అవుతోంది. గతంలో కళ్యాణ్ రామ్ తో అసాధ్యుడు చిత్రం డైరక్ట్ చేసిన అని కన్నెగంటి డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం కథ సెల్ ఫోన్ చుట్టూ తిరుగుతుంది. చిత్రం కథలో నూకయ్య (మనోజ్)ఎవరూ లేని అనాధ. సెల్‌ఫోన్లు దొంగతనం చేసి బ్రతుకుతూంటాడు. అలా దోచేసిన ఫోన్లని స్విచ్‌ఆఫ్ చేయకుండా వారితో సంబంధాలు కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలోనే అను (కృతికర్బందా) అనే బ్యాంక్ మేనేజర్‌తోనూ, శిల్ప (సనాఖాన్) అనే పబ్ ఉద్యోగినితోనూ నూకయ్యకి పరిచయం కలుగుతుంది. వారి జీవితాలని ఈ కుర్రాడు ఎలా ప్రభావితం చేశాడనే విషయంతో సాగే చిత్రమే ఇది.
ఛార్జర్ (వెన్నెలకిషోర్) పాత్ర కథలో కీలకం. ఇక చిత్రం గురించి దర్శకుడు అని మాట్లాడుతూ ''వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో తెరకెక్కిన చిత్రమిది. మనోజ్ చేసిన ఫైట్స్ చిత్రానికి బలాన్నిస్తాయి. ''నో క్యాప్షన్-ఓన్లీ యాక్షన్'' అన్న ఉప శీర్షికకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఆద్యంతం యాక్షన్, కామెడీతో నిండి ఉంటుంది. కథానుగుణంగా ఈ సినిమాకు ''మిస్టర్ నూకయ్య'' అనే టైటిల్ ను పెట్టడం జరిగింది. మనోజ్ ఇందులో 12 గెటప్స్ తో కనిపిస్తూ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తాడు. రియల్ గా తను చేసిన రిస్కీ ఫైట్స్ ఈ సినిమాలో ఓ హైలెట్ గా నిలుస్తాయి. అన్న విభాగాల నుంచి ది బెస్ట్ ఔట్ పుట్ వచ్చింది. ''అన్నారు.
సంస్థ: శ్రీ శైలేంద్ర సినిమాస్
నటీనటులు: మంచు మనోజ్, సనాఖాన్, కృతికర్బందా, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, మురళీకృష్ణ, భావన తదితరులు
సంగీతం: యువన్‌శంకర్ రాజా
నిర్మాత: డి.ఎస్.రావు
దర్శకత్వం: అని కన్నెగంటి
విడుదల: గురువారం


Click it and Unblock the Notifications











