'మిస్టర్ నూకయ్య రీలోడెడ్' ఈ నెల్లోనే: మంచు మనోజ్
మంచు మనోజ్ తాజా చిత్రం మిస్టర్ నూకయ్య రీలోడెడ్ పేరుతో మళ్లీ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మంచు మనోజ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు. ఆయన ట్వీట్ చేస్తూ...మిస్టర్ నూకయ్య లీలోడెడ్ రాకింగ్...మీరు ఈ సారి చాలా పాస్ట్ గా,స్లీక్ గా ఉండే వెర్షన్ ని చూస్తారు. ఈ కొత్త వెర్షన్ ఈ నెల 16 లేదా 17 వ తేదీన విడుదల అవుతుంది. నేను సూపర్ గా ఎక్సైట్ అవుతున్నాను. నేను వెబ్ సైట్ ,మీడియా వారందికి ఓ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సినిమా రీలోడెడ్ వెర్షన్ కి రివ్యూ రాయగలరు. రాకెట్ స్పీడుతో వర్కు జరుగుతోంది అని ట్వీట్ చేసారు.
ఇక మిస్టర్ నూకయ్య చిత్రం మొన్న హోలీ రోజు విడుదల అయ్యింది. అయితే మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. సినిమా స్లో నేరషన్ తో నడవటం,సెకండాఫ్ కాస్త ఇబ్బందిగా మారిందని టాక్ వచ్చింది. అలాగే నోకియా కంపెనీ వారు ఈ చిత్రం మల్టిప్లెక్స్ లలో విడుదల కానివ్వకుండా అడ్డుపడ్డారు. ఈ నేపధ్యంలో సినిమాని మరింతగా షార్ట్ చేసి ఎడిటింగ్ చేసి వదులుతున్నాడు. సనాఖాన్,కృతి కర్బంగా హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రంలో రాజా ఓ కీ రోల్ ని ప్లే చేసాడు. అని కన్నెగంటి డైరక్ట్ చేసిన ఈ చిత్రాన్ని డిఎస్ రావు నిర్మించారు.


Click it and Unblock the Notifications











