twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సునీల్ ‘మిస్టర్ పెళ్లి కొడుకు’ ఆడియో ఎప్పుడంటే?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ సునీల్ హీరోగా 'అందాల రాముడు' చిత్రాన్ని గతంలో రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సంస్థ సునీల్ తో రూపొందిస్తున్న చిత్రం 'మిస్టర్ పెళ్లి కొడుకు'. ఆర్ బి చౌదరి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.

    ఈ చిత్రం గురించి ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ...హిందీలో విజయవంతమైన 'తను వెడ్స్ మను' ఆధారంగా మన తెలుగు నేటివిటీకి కావాల్సిన అన్ని మార్పుల్ని చేసి ఈ చిత్రాన్ని చేస్తున్నాం. షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియోని సంక్రాంతిలోపే విడుదల చేస్తామని తెలిపారు.

    నిర్మాత ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ...ఆద్యంతం అన్ని తరగతుల వారిని నవ్వించే చక్కని కథా చిత్రమిది. తన పాత్రలో సునీల్ పూర్తిగా ఇన్ వాల్వ్ అయి నటించారు. వీలైతే ఈ నెలలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని అన్నారు. మరో నిర్మాత పరాస్ జైన్ మాట్లాడుతూ మా సంస్థ పర్మినెంట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఏ.రాజ్ కుమార్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆరు పాటల్ని అద్భుతంగా చేసారు. సునీల్ ఈ చిత్రంలో నటించడం కంటే జీవించాడని చెప్పడం బెటర్. ఈ చిత్రం తర్వాత దేవిప్రసాద్ పెద్ద దర్శకుల జాబితాలో చేరుతాడు. కెమెరామెన్ సమీర్ సునీల్‌ని ఎంతో గ్లామరస్ గా చూపించాడని చెప్పుకొచ్చారు.

    సునీల్ సరసన ఇషా చావ్లా నటించిన ఈ చిత్రంలో అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎల్.బి.శ్రీరామ్, ఆహుతిప్రసాద్, రవిబాబు, ఎం.ఎస్. నారాయణ, తులసి, ఉషశ్రీ, అర్చన, భవాని ముఖ్య పాత్రలు పోషించారు. విలన్ గా విన్సెంట్ అనే కొత్త నటుడు పరిచయం అవుతున్నాడు. ఈచిత్రానికి సంగీతం : ఎస్.ఏ.రాజ్ కుమార్, కెమెరా : సమీర్ రెడ్డి, ఆర్ట్ : ఎం.ఎస్. రవికుమార్, ఫైట్స్ : కనల్ కణ్ణన్, ఎడిటింగ్ : నందమూరి హరి, కో డైరెక్టర్స్ : ఎన్.బ్రహ్మాజీ, విజయ్ కుమార్, ప్రొడక్షన్ : భీమనేని రాయుడు, సమర్పణ : ఆర్.బి.చౌదరి, నిర్మాతలు : ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం : దేవిప్రసాద్.

    English summary
    
 Comedian turned hero Sunil's upcoming movie Mr.Pellikoduku shooting is completed. This movie audio releasing before Sankranthi. Mr.Pellikoduku is the official remake of hindi film, Tanu weds manu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X